గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యల పై అమిత్ షా స్పందన

Amit Shah Respond : కరోనావైరస్ మహమ్మారి మధ్య ఆలయాలను తిరిగి తెరిచే అంశంపైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు రాసిన లేఖలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి చేసిన వ్యాఖ్యల పైన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు.

Update: 2020-10-18 09:50 GMT

Amit Shah Respond : కరోనావైరస్ మహమ్మారి మధ్య ఆలయాలను తిరిగి తెరిచే అంశంపైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు రాసిన లేఖలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి చేసిన వ్యాఖ్యల పైన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. అమిత్ షా మాట్లాడుతూ.. 'నేను లేఖ చదివాను. ఆల‌యాల్లో ద‌ర్శ‌నాల‌కు అమ‌నుతి ఇవ్వాలంటూ ఆయ‌న ఆ లేఖ‌లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొంత సంయమనం పాటించవచ్చని నేను నమ్ముతున్నాను' అని అమిత్ షా పేర్కొన్నారు.

మహారాష్ట్రలో అలయలను తిరిగి తెరవడం గురించి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి గతవారం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. ఆ లేఖలో అయన "బార్లు, రెస్టారెంట్లు, బీచ్‌లను తెరిచారు. కానీ దేవుళ్లను లాక్‌డౌన్‌లో ఉంచారు. ఇలా చేయమని భగవంతుడి నుంచి మీకేమైనా ఆదేశాలు వచ్చాయా? లేదా మీరే అకస్మాత్తుగా లౌకికవాదిగా మారారా?" అని అయన పేర్కొన్నారు. దీనితో ఇద్దరి మధ్య మాటల యద్దానికి దారీ తీసింది.

దీనిపైన ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమాధానం ఇస్తూ.. నేను ఆచరించే హిందుత్వకు గవర్నర్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదని అన్నారు. ప్రజల ఉద్వేగాలు, నమ్మకాలను పరిగణనలోకి తీసుకుంటూనే వారి ప్రాణాలను కాపాడాల్సిన అవసరం కూడా ఉందని, లాక్‌డౌన్‌ను ఎత్తివేయడం సరికాదని ఉద్ధవ్ అన్నారు.

అయితే గవర్నర్ వ్యాఖ్యల పట్ల శివసేన, విపక్ష నేతలు కూడా ఫైర్ అయ్యారు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల బీజేపీ ఎలా స్పందిస్తుంది అని అమిత్‌ షాను ప్రశ్నించగా జరుగుతున్న సంఘటనల్ని ఉద్దేశిస్తూ భగత్ సింగ్ కోశారీ ఆ వ్యాఖ్యలు చేశారు.. నా ఉద్దేశ ప్రకారం అయన ఆ పదాలను ఉపయోగించకుండా ఉంటే బాగుండేది అని అమిత్ షా అన్నారు. ఇక అక్టోబర్ 5 నుండి రాష్ట్రంలో 50% సామర్థ్యంతో బార్‌లు మరియు రెస్టారెంట్లు పనిచేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.

Tags:    

Similar News