Corona Effect: పిల్లలకు సెలవులు కాని సెలవులు.. భవితకు కనిపించని దారులు !

Update: 2020-08-05 09:00 GMT

Corona Effect: కరోనా తెచ్చిన కష్టాలు ఇన్నీ అన్నీ కావు. బయటికి వెళ్తే ఎక్కడ వైరస్ అంటుకుంటుందో తెలియని పరిస్థితి. మరోవైపు గత నాలుగు నెలలుగా విద్యాసంస్థలు మూత బడ్డాయి. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్న పిల్లలు వారి తల్లిదండ్రులు ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారో ఓ లుక్ వేయండి.

నాలుగైదు నెలల క్రితం ప్రొద్దున్నే స్కూళ్లకు వెళ్లాల్సిన పిల్లలు స్కూళ్లకు ఆఫీస్ లకు పరుగులు తీయల్సిన పెద్దలు ఆఫీస్ లకు వెళ్తు హడావిడిగా రోజు గడిచేది. కరోనా పుణ్యమా అని మొదలైన లాక్ డౌన్ మొదట్లో బావుందిలే అనిపించినా రాను రాను పరిస్థితి మరోలా మారింది. ఒకప్పుడు బడులు లేకుండా ఇంట్లోనే బాగుండునని భావించిన పిల్లలు ఇప్పుడు స్కూళ్ల బాట పడతామంటున్నారు. ఇంట్లో ఉండి టీవీ చూడడమో లేదంటే స్మార్ట్ ఫోన్ చూసుకుంటూ గేమ్స్ అడుకోవడమో ఒక్కటే కాలక్షేపం. బయటికి వెళ్లి స్నేహితులతో ఆడుకునే పరిస్థితి లేదు. వెళ్తే ఎక్కడ కరోనా మహమ్మారి బారిన పడ్తారో అని భయం. మరో దారి లేకపోయేసరికి ఇంట్లో పిల్లల అల్లరి మితిమీరిపోతోంది. వాళ్ల పెంకితనాన్ని తల్లిదండ్రులు భరించలేకపోతున్నారు.

పాఠశాలలే మొదలై ఉంటే పిల్లలు అక్కడే చదువుకొని, స్నేహితులతో గేమ్స్ అడి టైం పాస్ చేసుకునేవారు. ఏ సాయంత్రానికో అలసిపోయి ఇంటికొచ్చిన పిల్లలతో అంత సమస్య ఉండేది కాదు. ఇప్పుడు గత నాలుగు నెలలుగా ఇంట్లోనే పిల్లలు ఉండడంతో సమస్యలు మొదలయ్యాయి. లాక్ డౌన్ మొదలైన కొత్తలో ఎంజాయ్ చేసిన రోజులు ఇప్పుడు లేకపోయేసరికి ఏమి దిక్కు తోచని పరిస్థితుల్లో పిల్లలు ఒకరితో మరొకరు కయ్యానికి దిగుతున్నారు. ఈ పరిస్థితి ఇంచుమించు అన్ని ఇళ్లల్లో కనిపిస్తున్నాయి. దీంతో పేరెంట్స్ తలలు పట్టుకుంటున్నారు. కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని పేరెంట్స్ ఎదురు చూస్తున్నారు. పిల్లలు మళ్లీ పాఠశాలలకు వెళ్తే మళ్లీ లైఫ్ రూటిన్ లో పడి అన్నీ సర్దుకుంటాయని భావిస్తున్నారు.

Tags:    

Similar News