ఎయిర్ ఇండియా క్రాష్..ఇండియాలోనే అత్యంత ఖరీదైన విమానయాన ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇదేనేమో..

Most Expensive Aviation Insurance Claim: డ్రీమ్ లైనర్ క్రాష్ విషయంలో బోయింగ్ విమానం ప్రమాదానికి గురైంది అలాగే వందలాది మంది ప్రాణాలను బలికొంది కాబట్టి భారీ స్థాయిలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే ఛాన్స్ ఉండొచ్చు.

Update: 2025-06-13 08:35 GMT

ఎయిర్ ఇండియా క్రాష్..ఇండియాలోనే అత్యంత ఖరీదైన విమానయాన ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇదేనేమో..

Most Expensive Aviation Insurance Claim: డ్రీమ్ లైనర్ క్రాష్ విషయంలో బోయింగ్ విమానం ప్రమాదానికి గురైంది అలాగే వందలాది మంది ప్రాణాలను బలికొంది కాబట్టి భారీ స్థాయిలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. హల్ , లయబిలిటీ విభాగాల్లో క్లెయిమ్ చేయొచ్చు.

గురువారం మధ్యాహ్నం జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది చనిపోయారు. దీంతో ఇది భారత దేశంలోనే అత్యంత ఖరీదైన విమానయాన క్లెయిమ్ కావచ్చు. దాదాపు 211 మిలియన్ డాలర్ల నుంచి 280 మిలియన్ డాలర్ల వరకు లయబిలిటీస్ ఉండొచ్చు. అంటే దీని మొత్తం రు. 2,400 కోట్లు.

లండన్‌లోని గాట్విక్ విమానశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే ప్రమాదానికి గురైంది. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటీష్ జాతీయులు, 7 మంది పోర్చుగీస్ జాతీయులు, ఒక కెనడియన్ ఉన్నారు. బ్రిటీష్ ఇండియన్ అయిన విశ్వాస్ కుమార్ రమేష్ మాత్రమే ఈ ప్రమాదం నుండి బయటపడ్డారు.

జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (GIC) చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రామస్వామి నారాయణన్ ప్రకారం చూస్తే ఎయిర్ లైన్స్ ఫ్లీట్ ఇన్సూరెన్స్ పాలసీ సాధారణంగా విమాన హల్స్, విడిభాగాలు, ప్రయాణికులకు అలాగే థర్డ్ పార్టీలకు జరిగిన నష్టాలను కవర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎయిర్ ఇండియా క్రాష్ విషయంలో బోయింగ్ మంటల్లో చిక్కుకుపోయి వందలాది మంది ప్రాణాలకు కారణం అయింది. అందుకే హల్ మరియు లయబిలిటీస్ రెండింటిలోనూ క్లెయిమ్ చేయొచ్చు. వయసు, కాన్‌ఫిగరేషర్, ఇతర అంశాలపై ఈ క్లెయిమ్ ఆధారపడి ఉంటుంది. మొత్తానికి 211 మిలియన్ డాలర్ల నుంచి 280 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని హోడెన్ ఇండియా CEO మరియు MD అమిత్ అగర్వాల్ అన్నారు.

ఈ ప్రమాదానికి గురైన విమానం డ్రీమ్ లైనర్ (VT-ABN) 2013 మోడల్. 2021లో సుమారు 115 మిలియన్ కోట్ల రూపాయలకు దీన్ని బీమా చేశారు. అయితే జరిగన నష్టం చిన్నదైనా పెద్దదైనా ఎయిర్ లైన్స్ ప్రకటించిన విలువ ఆధారంగా నష్టం కవర్ చేయబడుతుందని అగర్వాల్ అన్నారు.

ఇదిలా ఉంటే విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబాలకు టాటా గ్రూప్ గురువారం రూ. కోటి పరిహారాన్ని ప్రకటించింది.

Tags:    

Similar News