Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంలో.. ఒకే ఒక్కడు మిగిలాడు..!

Ahmedabad Plane Crash: అహ్మాదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యహ్నం 1.30 నిలకు కుప్పకూలిపోయింది.

Update: 2025-06-13 06:11 GMT

Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంలో.. ఒకే ఒక్కడు మిగిలాడు..!

Ahmedabad Plane Crash: అహ్మాదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యహ్నం 1.30 నిలకు కుప్పకూలిపోయింది.

ప్రమాదానికి గురైన విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటీష్ జాతీయులు. విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ ని టేకాఫ్ అయిన 5 నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరిగిన రెండు గంటల తర్వాత ఈ విమానంలో ప్రయాణించిన 242 మంది చనిపోయారని ఎయిర్ ఇండియా వెల్లడించింది. అయితే ఆ తర్వాత అదృష్టవశాత్తూ విశ్వాస్ అనే ఒక వ్యక్తి మంటల్లోంచి మెల్లగా నడిచి వచ్చాడు. దీంతో మళ్లీ ఈ ప్రమాదంలో 241 మంది చనిపోయారని, ఒకరు బతికారని వెల్లడించింది. ఇంతకీ ఈ విశ్వాస్ ఎవరు? అంత ఎత్తులోంచి కూలిన విమానంలొ ఇతను ఎక్కడ ఉన్నాడు?

ఆన్ లైన్ ఒక సెల్ ఫోన్ వీడియో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో 11A సీటు దగ్గర ఒక ప్రయాణికుడు తిరుగుతున్నట్టు కనిపించింది. తెల్లటి టీ షర్ట్, ముదురు రంగు ప్యాంటు వేసుకుని ఉన్నాడు. కాలికి గాయం కావడంతో కుంటుతూ నడుచుకుంటూ బయటకు వస్తున్నాడు. ఆ తర్వాతే పోలీసులు 11A సీటులో ఉన్న ప్రాణాలతో బయటపడ్డాడని వెల్లడించారు. ఇతను ఇప్పుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

ప్రాణాలతో బయటపడిన వ్యక్తి పేరు విశ్వాస్ కుమార్ రమేష్, ఇతను బ్రిటిష్ ఇండియన్. తన బంధువులను చూడడానికి ఇండియాకి వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇతనితో పాటు తన అన్నయ్య అజయ్ కూడా ఈ విమానంలో ఉన్నట్టు తెలుస్తోంది. అతనికోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విశ్వాస్ తమతో మాట్లాడినట్టు ఎఎన్ఐ తెలిపింది. విశ్వాస్ కు చెందిన బోర్డింగ్ పాస్ ని కూడా ఎఎన్ఐ తీసుకుంది. టేకాఫ్ అయిన 30 సెకన్లకే విమానంలో పెద్దగా శబ్ధం వచ్చిందని, ఆ తర్వాత కాసేపటికే విమానం క్రాష్ అయిందని, ఇక తనకు ఏం జరిగిందో ఏదీ గుర్తు లేదని విశ్వాస్ చెప్పినట్టుగా ఎఎన్ఐ తెలిపింది.

విశ్వాస్‌కు భార్య, కూతురు ఉన్నారు. ఇండియాలో పుట్టిన విశ్వాస్ గత కొన్నేళ్లుగా UKలో ఉంటున్నారు.

విమానం అహ్మాదాబాద్ లో టేకాఫ్ అయిన తర్వాత ఐదు నిమిషాలకే కూలిపోయింది. విమానం దాదాపు 825 అడుగులు ఎత్తుకు చేరుకున్న తర్వాత అకస్మాత్తుగా పడిపోవడం ప్రారంభించింది. అప్పుడే పైలెట్ నుండి మే డే కాల్ వచ్చింది. ఆ తర్వాత ఒక చెట్టుకు ఢీకొని కూలిపోయింది.

ఈ ప్రమాదానికి కారణాలేంటన్నది తెలుసుకునేందుకు ధర్యాప్తు బృందాలు విచారణను మొదలుపెట్టాయి. సాంకేతిక సమస్యా లేక మానవ తప్పిదమా? అనేది తేలనుంది.

Tags:    

Similar News