ఢిల్లీ అసెంబ్లీలో నోట్ల కట్టల కలకలం.. కవర్లోంచి నోట్ల కట్టలు తీసిన ఆప్ ఎమ్మెల్యే
Delhi Assembly: ఢిల్లీ అసెంబ్లీలో నోట్ల కట్టల కలకలం రేగింది.
ఢిల్లీ అసెంబ్లీలో నోట్ల కట్టల కలకలం.. కవర్లోంచి నోట్ల కట్టలు తీసిన ఆప్ ఎమ్మెల్యే
Delhi Assembly: ఢిల్లీ అసెంబ్లీలో నోట్ల కట్టల కలకలం రేగింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మహేందర్ గోయల్ డబ్బులు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. కవర్లోంచి నోట్ల కట్టలు తీసిన ఆప్ ఎమ్మెల్యే.. అసెంబ్లీలో హంగామా సృష్టించారు. నగర ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ తనకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపించారు. రోహిణిలోని బాబాసాహెబ్ అంబేద్కర్ హాస్పిటల్‌లో తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవడంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
దీనిపై ఫిర్యాదు చేశానని నిందితులు శక్తిమంతులని తనను మౌనంగా ఉంచే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీనివల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని గోయల్ ఆందోళన వెలిబుచ్చారు. తాను బెదిరింపులకు లొంగలేదని, ప్రైవేట్ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు రక్షణ కావాలని.. ప్రాణాలకు ముప్పు ఉందిని మహేందర్ గోయల్ స్పీకర్‌ను కోరారు. తన దగ్గర ఉన్న ఆధారాలు సమర్పించాలని ఆప్ ఎమ్మెల్యేకు స్పీకర్ సూచించారు.