ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‎లో ఘనంగా 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం

*ఉత్తమ నటులుగా అవార్డులు అందుకున్న అజయ్ దేవగన్, సూర్య

Update: 2022-09-30 15:15 GMT

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‎లో ఘనంగా 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం

National Film Awards 2020: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో 2020 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. 2020 కేంద్రం ఏడాదికి గాను జాతీయ అవార్డులను ప్ర‌క‌టించిన కేంద్రం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు చిత్రాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నటీ నటులకు ఈ అవార్డులు ప్రధానం చేశారు. ది అన్‌సంగ్ వారియర్ చిత్రానికి ఉత్తమ నటుడిగా అజయ్ దేవగన్, సూరరై పొట్రు చిత్రానికి హీరో సూర్య ఉత్తమ నటులుగా అవార్డులు అదుకున్నారు. అలాగే జీవీ ప్ర‌కాశ్‌కుమార్‌, అప‌ర్ణ బాల‌ముర‌ళి, డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర అవార్డుల‌ను అందుకున్నారు.

వీరితోపాటు ప్రముఖ నటి ఆశాపరేఖ్ కూడా భారతీయ సినిమాకు ఆమె చేసిన కృషికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందకున్నారు. ఇక తెలుగు చిత్రాలలో అలా వైకుంఠ పురం సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగి తమన్, కలర్ ఫోటో సినిమాకు బెస్ట్ ఫిలిం ఫేర్ అవార్డు ఆసినిమా డైరెక్టర్ అంగిరేకుల సందీప్ అందకున్నారు. ఇక బెస్ట్ కొరియో గ్రాఫర్‎గా నాట్యం చిత్రానికి గానూ సంధ్యారాజు, ఇక ఇదే సినిమా బెస్ట్ మేకప్ ఆర్టిస్టుగా రాంబాబు అవార్డును అందుకున్నారు. ఈసందర్భంగా ప్రత్యేక అవార్డులు ప్రధానం చేసి రాష్ట్రపతి ముర్ము విజేతలను ప్రత్యేకంగా అభినందించారు. 

Tags:    

Similar News