Silver Shivling: ఘాగ్రా నదిలో 53 కేజీల వెండి శివలింగం లభ్యం
Silver Shivling: ఉత్తరప్రదేశ్ లోని ఘాగ్రా నది నుంచి వెండి శివలింగం బయటపడింది.
Silver Shivling: ఘాగ్రా నదిలో 53 కేజీల వెండి శివలింగం లభ్యం
Silver Shivling: ఉత్తరప్రదేశ్ లోని ఘాగ్రా నది నుంచి వెండి శివలింగం బయటపడింది. రామ్ మిలన్ అనే ఓ భక్తుడు స్నానం చేస్తుండగా నదిలో ఇసుక నుంచి మిలమిల మెరుస్తున్న శివలింగం కనిపించింది. దాన్ని వెంటనే బయటకు తీసి శభ్రం చేసి చూడగా వెండి శివలింగంగా తేలింది. ఈ వార్త వెంటనే అంతటా వ్యాపించడంతో శివలింగం కాస్తా పోలీస్ స్టేషన్ కు చేరింది. పోలీసులు దాన్ని పరిశీలించి చూడగా అది 53 కిలోల బరువున్నట్టు నిర్ధారించారు. అయితే వెండి శివలింగం నదలోకి ఎలా వెళ్లింది ఎవరు వేశారు ఎందుకు వేశారు అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో హిందూ భక్తులు పోలీస్ స్టేషన్ కు చేరి శివలింగాన్ని అభిషేకిస్తున్నారు.