Corona Cases in India: దేశంలో కొత్తగా 37,593 మందికి కరోనా పాజిటివ్
* ఒక్క కేరళలోనే 24 వేలకు పైగా కేసులు * మొత్తం కేసుల్లో 65శాతం ఒక్క రాష్ట్రంలోనే * కరోనాతో మరో 648 మంది మృతి
Representation Photo
Corona Cases in India: దేశంలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 37,593 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. గడిచిన ఒక రోజు తో పోలిస్తే ఈ సంఖ్య 47.6 శాతం ఎక్కువగా నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.25 కోట్లు దాటింది. అయితే తాజా కేసుల్లో అత్యధిక కేసులు కేరళలోనే నమోదు అయ్యాయి. ఒక్క కేరళలోనే 24వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్త కేసుల్లో దాదాపు 65శాతం ఒక్క ఆ రాష్ట్రంలోనే బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. రీసెంట్‌గా జరిగిన ఓనమ్ సంబరాలతో వచ్చే నాలుగు వారాలు అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం సూచించింది.
ఇక దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య మళ్లీ 600 దాటింది. గడిచిన 24గంటల్లో కోవిడ్‌తో మరో 648 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో 173మంది మృతి చెందారు. దీంతో కరోనాతో మొత్తం 4 లక్షల 35వేల 758మంది చనిపోయారు. ఇక 24గంటల వ్యవధిలో మరో 34 వేల 169 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.17 కోట్ల మంది కరోనాను జయించగా రికవరీ రేటు 97.67 శాతానికి చేరింది. మరోవైపు వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడంతో దేశంలో క్రియాశీల రేటు ఒక శాతం దిగువకు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3 లక్షల 22 వేల 327 యాక్టివ్ కేసులున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.