Omicron Cases in India: భారత్‌లో 145 కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య

*తాజాగా గుజరాత్‌‌లో రెండు ఒమిక్రాన్ కేసులు *బ్రిటన్ నుంచి గుజరాత్‌కు వచ్చిన ఓ వ్యక్తి, బాలుడికి ఒమిక్రాన్

Update: 2021-12-19 16:30 GMT

భారత్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

Omicron Cases in India: భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా గుజరాత్​లో ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 145కు చేరింది. బ్రిటన్​నుంచి గుజరాత్​కు వచ్చిన ఓ వ్యక్తి సహా బాలుడిలో ఒమిక్రాన్ వేరియంట్​ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఆ ఇద్దరిని అహ్మదాబాద్​లోని ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. ప్రస్తుతం వారు క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు.

కేంద్రం, రాష్ట్రాల లెక్కల ప్రకారం.. దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్​కేసులను ప్రభుత్వాలు గుర్తించాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 48 కేసులు బయటపడ్డాయి. ఢిల్లీలో 22, తెలంగాణ 20, రాజస్థాన్​17, కర్ణాటక 14, కేరళ 11, గుజరాత్​ 9, ఆంధ్రప్రదేశ్, చంఢీగఢ్​, తమిళనాడు, బెంగాల్​లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ నిర్ధారణ అయిన 48 మందిలో 28 మంది ఇప్పటికే కోలుకుని ఇళ్లకు వెళ్లారని అధికారులు తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ విస్తరిస్తోంది. 89 దేశాల్లో ఈ వేరియంట్​ను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలిపింది. 1.5 నుంచి 3 రోజుల వ్యవధిలోనే వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నట్లు పేర్కొంది. అయితే రోగ నిరోధక శక్తిపై ఈ వేరియంట్​ ఎంతమేర ప్రభావం చూపిస్తుందన్న దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

Tags:    

Similar News