Covid-19: కరోనా మరణాల కలవరం.. 24 గంటల్లో 12 మంది మృతి

Covid-19: ఒడిశా, హరియాణాలలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదు

Update: 2024-01-06 04:45 GMT

Covid-19: కరోనా మరణాల కలవరం.. 24 గంటల్లో 12 మంది మృతి 

Covid-19: దేశంలో మరోసారి కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. ఒక్కరోజులో 761 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లోనే 12 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. కేరళలో అయిదుగురు, కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్లో ఒక్కరు మహమ్మారికి బలయ్యారు. ఈ క్రమంలో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల 334కు చేరిందని, ఆరోగ్యశాఖ తెలిపింది. మరోవైపు దేశంలో కొవిడ్-19 ఉపవేరియంట్ జేఎన్.1 కేసులు 619కు చేరాయని అధికారులు వెల్లడించారు. వీటిలో కర్ణాటకలో 199, కేరళలో 148, మహరాష్ట్రలో 110, గోవాలో 47, గుజరాత్లో 36, ఆంధ్రప్రదేశ్లో 30, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్థాన్లో 4, తెలంగాణలో 2, ఒడిశా, హరియాణాలలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు తెలిపారు. 

Tags:    

Similar News