ఆ అభిమానంతోనే 'నారప్ప' చేయలేదన్న దర్శకుడు హను రాఘవపూడి

Hanu Raghavapudi: "సీతారామం" సినిమాతో డైరెక్టర్ హను రాఘవపూడి కరియర్ లోనే మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు.

Update: 2022-08-09 11:30 GMT

ఆ అభిమానంతోనే 'నారప్ప' చేయలేదన్న దర్శకుడు హను రాఘవపూడి

Hanu Raghavapudi: "సీతారామం" సినిమాతో డైరెక్టర్ హను రాఘవపూడి కరియర్ లోనే మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఆగస్టు 5, 2022 న థియేటర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. "పడి పడి లేచే మనసు" సినిమాతో డిజాస్టర్ తర్వాత హను రాఘవపూడి తో సినిమా అంటే భయపడ్డ నిర్మాతలు ఇప్పుడు "సీతారామం" సినిమా చూసి హను తో సినిమా చేయడానికి క్యూ కడుతున్నారు. అయితే గతంలో హను రాఘవపూడి వెంకటేష్ నటించిన "నారప్ప" సినిమాకి దర్శకత్వం వహించే అవకాశాన్ని వదులుకున్నారు. తాజాగా ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు హను.

"సీతారామం" సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న హను రాఘవపూడిని తమిళంలో సూపర్ హిట్ అయిన "అసురన్" సినిమాకి తెలుగు రీమేక్ అయిన "నారప్ప" కి దర్శకత్వం వహించే అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు అని అడగగా, "నాకు వెట్రిమారన్ సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన సినిమా ఎప్పుడు విడుదల అయితే అప్పుడు చెన్నైకి వెళ్ళిపోయి ఫస్ట్ డే ఫస్ట్ చూస్తాను. కాబట్టి ఆయన సినిమాని రీమేక్ చేయలేక నారప్ప సినిమాని వదులుకున్నాను. కానీ వెట్రిమారన్ సినిమాలు చాలా హార్ట్ టచింగ్ గా ఉంటాయి. ఆయనది ఏదైనా ఒక సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని ఉంది," అని అన్నారు హను రాఘవపూడి.

Tags:    

Similar News