Water bells: ఆ బడిలో వాటర్ బెల్స్ కూడా కొడుతారు

ప్రతి స్కూల్లో ఫస్ట్ బెల్ మొదలుకుని లీజర్ బెల్ అనే పదాలు వినిపిస్తుంటాయి. కానీ ఈ స్కూల్లో మాత్రం వాటర్ బెల్ కూడా వినిపిస్తోంది. ప్రతి రోజు రెండు సార్లు వాటర్ బెల్ మోగుతుంది.

Update: 2025-02-07 10:02 GMT

ఆ బడిలో వాటర్ బెల్స్ కూడా కొడుతారు

Water bells:  ప్రతి స్కూల్లో ఫస్ట్ బెల్ మొదలుకుని లీజర్ బెల్ అనే పదాలు వినిపిస్తుంటాయి. కానీ ఈ స్కూల్లో మాత్రం వాటర్ బెల్ కూడా వినిపిస్తోంది. ప్రతి రోజు రెండు సార్లు వాటర్ బెల్ మోగుతుంది. ఇదేంది కొత్తగా అనుకుంటున్నారా? విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఆ స్కూల్ హెడ్ మాస్టర్‌ సహా స్టాఫ్ అంతా కలిసి ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంతకీ ఇది ఎక్కడో తెలుసుకోవాలని ఉందా. అయితే చూసేయండి.

రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల బడిలో నీటి గంటలు వినిపించే సాంప్రదాయానికి ఆ స్కూల్ శ్రీకారం చుట్టింది. అనారోగ్య సమస్యలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు తమవంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉపాధ్యాయులు. సాధారణంగా ఉపాధ్యాయులు వచ్చామా.. పాఠాలు చెప్పామా.. వెళ్లామా అన్నట్టు ఉంటారు. కానీ ఇక్కడ ఉపాధ్యాయులు మాత్రం అలా కాదు. విద్యాతో పాటు వారి ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వాటర్ తాగకపోతే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని తెలుసు. అందుకే అలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు వాటర్ తాగిస్తున్నారు. పిల్లలు ఇంట్లో కంటే ఎక్కువ సమయం స్కూల్లో గడుపుతుంటారు. అందుకే వారితో ఎక్కువ వాటర్ తాగించాలనే ఉద్దేశంతో స్కూల్లో వాటర్ బెల్ పెట్టారు.

ప్రతీ విద్యార్థి ఇంటి నుంచి స్కూలుకి వచ్చి తిరిగి ఇంటికి చేరే వరకు కనీసం 1 లీటర్ నీరు తాగాలని రూల్ పెట్టారు. అందుకు అవసరమైన చొరవ తీసుకుంటూ కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా రోజుకు రెండు సార్లు వాటర్ బెల్స్ మోగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ సమయంలో తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులంతా కూడా పాఠశాల ఆవరణలోకి వచ్చి నీటిని తాగాల్సి ఉంటుంది. వీరితో పాటు స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా నీరు తాగుతున్నారు.

అయితే ప్రస్తుతం అంతా ప్లాస్టిక్ మయం అయింది. ప్లాస్టిక్ బాటిళ్లల్లో వాటర్ తాగడం మంచిదికాదని వాటిని వాడొద్దని విద్యార్థులకు సూచించారు. ప్లాస్టిక్ బాటిల్స్‌కు చెక్ పెట్టిన టీచర్స్.. స్పాన్సర్ల సాయంతో ప్రతి విద్యార్థికి స్టీల్ వాటర్ బాటిల్ పంపిణీ చేయించారు. స్కూల్లో చదువుతున్న 165 మంది విద్యార్థులకు వాటర్ బాటిల్స్ అందించారు. ఫిబ్రవరి 6 నుంచి వాటర్ బెల్స్ ప్రోగ్రాం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా రోజుకు రెండు సార్లు వాటర్ బెల్ కొట్టే ఆనవాయితీని పెట్టారు.

వాటర్ బెల్స్ ప్రోగ్రామ్ మాత్రమే కాదు విద్యార్థుల భవితవ్యాన్ని తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులంతా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అంతే కాదు పదో తరగతి విద్యార్థులు కానీ ఇతర విద్యార్థులు స్కూల్‌కి రాకపోతే ఇంటికి వెళ్లి మరీ ఆరా తీస్తున్నారు. దానికి గల కారణాలను తెలుసుకుని తల్లిదండ్రులతో మాట్లాడి స్కూల్‌కి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. పిల్లలపై టీచర్లు చూపిస్తున్న శ్రద్దకు గ్రామస్తులు అభినందిస్తున్నారు.

అయితే జిల్లెల స్కూల్ హెచ్‌ఎం విద్యార్థులతో నీళ్లు తాగించడానికి ఓ కారణం ఉందంట. తాను గతంలో కరీంనగర్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పనిచేసినప్పుడు ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని... విద్యార్థులకు నీరు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. నీటి శాతం తగ్గడంతో కొలెస్ట్రాల్ పెరిగిందన్న విషయాన్ని ప్రాక్టికల్‌గా గమనించిన అనురాధ.. విద్యార్థులకు కచ్చితంగా నీరు తాగేందుకు అవసరమైన వాతావరణం కల్పించాలని భావించారు. అందుకే స్కూల్లో వాటర్ బెల్ పెట్టించారు. దీంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Tags:    

Similar News