ఆసక్తి రేకెత్తిస్తున్న విశ్వక్ టీజర్!
Vishwak Official Teaser : మూసకథలకి కాలం చెల్లింది. కొత్త కొత్త పాయింట్లతో ప్రేక్షకులను ఆకట్టుకొనే కథలతో ముందుకు వస్తున్నారు మేకర్స్.. అందులో భాగంగానే వాస్తవ సంఘటన ఆధారంగా ''విశ్వక్'' అనే సినిమా వస్తోంది.
Vishwak Official Teaser
Vishwak Official Teaser : మూసకథలకి కాలం చెల్లింది. కొత్త కొత్త పాయింట్లతో ప్రేక్షకులను ఆకట్టుకొనే కథలతో ముందుకు వస్తున్నారు మేకర్స్.. అందులో భాగంగానే వాస్తవ సంఘటన ఆధారంగా ''విశ్వక్'' అనే సినిమా వస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని నేడు (అక్టోబర్ 2) గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేశారు మేకర్స్.. ఎన్నారైలకేమో బాధ్యత లేదు.. ఇక్కడున్న వాళ్లకి నిర్లక్ష్యం.. రైతువి నువ్వేం చేస్తున్నావ్ రా అంటూ టీజర్ మొదలవుతుంది.. టీజర్ తోనే సినిమా పైన భారీ అంచనాలను పెంచాడు దర్శకుడు..
'ఏం చేస్తున్నావ్ జర్నలిస్ట్' అని ఓ లేడీ పాత్ర ఆడగగా, 'ఏదైనా వైరల్ కంటెంట్ రాస్తే మా ఎడిటర్ పబ్లిష్ చేస్తానన్నారు' అని మరో పాత్ర అడుగుతుంది. 'ఇంతకీ కంటెంట్ ఏంటని' అడుగగా 'ది గ్రేట్ ఫార్మర్స్ సూసైడ్ గురించి' అంటూ సమాధానం చెప్తాడు. ఫార్మర్స్ ఇష్యూ గురించి చెప్తారు చాలా సినిమాలు వచ్చాయి కదా.. అలా కాకుండా యూత్ గురించి ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా చెప్పొచ్చు కదా.. లవ్.. స్ట్రెస్.. వాళ్లలోని డిప్రెషన్ - స్ట్రగుల్స్' అంటూ చెప్పుకోస్తోంది.
'నువ్వు గెలవాలనుకుంటే నీకు సరైన వేవ్ లెన్త్ ఉన్న టీమ్ కావాలి.. ఆ టీమ్ బయట దేశంలో ఉంది..' అంటూ యూత్ ని టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తోంది. 'ఫుడ్ బెడ్ బావుందని పక్కింటికి వెళ్లి బతుకుతావా? బెటర్ లైఫ్ ఉందని పక్క దేశానికి వెళ్తావా? సిగ్గుందారా మీకు అంటూ హీరో ప్రశ్నిస్తాడు.. అంతేకాకుండా టీజర్ లో 'దేశాన్ని దత్తత తీసుకునేవారు కావాలి' అని ప్లకార్డులు చూపించారు దర్శకుడు. మొత్తం మీదా నలుగు సమస్యలపైన దర్శకుడు సినిమాని చూపించాలని అనుకున్నాడన్న విషయం అర్ధం అవుతుంది.