నిర్మాణ రంగంలోకి వినోద్ ఫిల్మ్ అకాడమీ.. ప్రొడక్షన్ నెంబర్ 1 ప్రారంభం

టాలీవుడ్‌లో నూతన నటీనటులకు సరైన మార్గదర్శకత్వం వహిస్తూ, వారిలోని ప్రతిభను వెలికితీస్తున్న ప్రముఖ సంస్థ 'వినోద్ ఫిల్మ్ అకాడమీ' (VFA) విజయవంతంగా 5 ఏళ్లు పూర్తి చేసుకుని, 6వ వసంతంలోకి అడుగుపెట్టింది.

Update: 2025-12-23 05:30 GMT

టాలీవుడ్‌లో నూతన నటీనటులకు సరైన మార్గదర్శకత్వం వహిస్తూ, వారిలోని ప్రతిభను వెలికితీస్తున్న ప్రముఖ సంస్థ 'వినోద్ ఫిల్మ్ అకాడమీ' (VFA) విజయవంతంగా 5 ఏళ్లు పూర్తి చేసుకుని, 6వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, డిసెంబర్ 21న హైదరాబాద్‌లోని రవీంద్రభారతి (పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్)లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

కేవలం శిక్షణకే పరిమితం కాకుండా, తమ విద్యార్థులకు వెండితెరపై అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా వినోద్ కుమార్ నువ్వుల 'వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్' అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రాన్ని ఈ వేడుకలోనే అధికారికంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నటులు ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ.. "వేలాది మంది నటులవ్వాలని వస్తారు కానీ సరైన శిక్షణ లేక వెనకబడిపోతారు. వినోద్ కుమార్ తన అనుభవాన్ని విద్యార్థులకు పంచడం అభినందనీయం. ఆయన క్రమశిక్షణే ఈ అకాడమీ విజయానికి పునాది" అని కొనియాడారు.

దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. "టెక్నిక్, ఎమోషన్ కలగలిసిన శిక్షణ VFA ప్రత్యేకత. ఈ రోజు ఇక్కడ సత్కారం పొందిన విద్యార్థులే ఈ సంస్థ నాణ్యతకు నిదర్శనం" అని పేర్కొన్నారు.

సంస్థ అధినేత వినోద్ కుమార్ నువ్వుల మాట్లాడుతూ.. "వినోద్ ఫిల్మ్ అకాడమీ నా ఐదేళ్ల కల. ఎంతో మంది యువతకు సరైన మార్గం చూపించాలనే లక్ష్యంతోనే దీనిని స్థాపించాను. శిక్షణ పొందిన నా విద్యార్థుల ప్రతిభను వెండితెరపై చూపించేందుకే ఈ సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాను. ఈ సినిమాలో మా విద్యార్థులే నటీనటులుగా, సాంకేతిక నిపుణులుగా వ్యవహరిస్తారు" అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాజశేఖర్ ఆనింగి, డాక్టర్ సుధాకర్, ప్రొఫెసర్ విల్సన్, VFA ప్రిన్సిపల్ కిషోర్ దాస్, HOD బబ్లూ, జబర్ధస్త్ జీవన్, నటి అమ్మినేని స్వప్న చౌదరి, పృథ్వీ, VFA టీమ్ సభ్యులు ఉష శ్రీ, విజయ్ భరత్, విజయ్ గుర్రపు, మురళి తదితరులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.

Tags:    

Similar News