మాస్టర్ చిత్రానికీ తప్పని లీకుల తిప్పలు.. రిలీజ్‌కు ముందే నెట్‌లో ప్రత్యక్షమైన..

Update: 2021-01-12 01:40 GMT

ఇళయ తలపతి విజయ్ నటిస్తోన్న మాస్టర్ చిత్రానికీ లీకుల తిప్పలు తప్పలేదు. రిలీజ్‌కు ముందే సినిమా క్లిప్పులు నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. రేపు థియేటర్లలో సినిమా రిలీజ్ అవుతుండగా రెండు రోజుల ముందే గుర్తు తెలియని వ్యక్తులు మూవీ క్లిప్స్ లీక్ చేశారు. ఇలా విడుద‌ల కావ‌డం చిత్ర యూనిట్‌కు నిరాశ‌ను క‌లిగించే అంశం. దీంతో చిత్ర యూనిట్ దిద్దుబాటు చ‌ర్య‌ల‌ను చేప‌ట్టింది.

ద‌ర్శ‌కుడు లోకేశ్ క‌న‌క‌రాజ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫ్యాన్స్ స‌హా సినీ అభిమానుల‌కు విజ్ఞ‌ప్తి చేసుకున్నాడు. చాలా మంది సాంకేతిక నిపుణులు, న‌టీన‌టులు ప‌డ్డ క‌ష్టం. దాన్ని థియేట‌ర్స్‌లోనే చూసి ఎంజాయ్ చేస్తే బావుంటుంది. ఏడాదిన్న‌ర ప‌డ్డ‌క‌ష్టం. ఆన్‌లైన్‌లో లీక్ అయిన క్లిప్స్‌ను ద‌య‌చేసి షేర్ చేయ‌కండి. ఓ రోజు మాత్ర‌మే ఉంది. సినిమాను థియేట‌ర్స్‌లో చూద్దామంటూ లోకేశ్ క‌న‌క‌రాజ్ రిక్వెస్ట్ చేశాడు.

Tags:    

Similar News