Rare Feat For Nagarjuna, Ram Charan : అప్పుడు నాగార్జున, ఇప్పుడు రామ్ చరణ్!

Rare Feat For Nagarjuna, Ram Charan : అక్కినేని నాగేశ్వర్ రావు నటవారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అక్కినేని నాగార్జున.. హీరోగా మంచి గుర్తింపు

Update: 2020-08-19 09:05 GMT
Nagarjuna, Ram Charan( File Photo)

Rare Feat For Nagarjuna, Ram Charan : అక్కినేని నాగేశ్వర్ రావు నటవారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అక్కినేని నాగార్జున.. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున ఆ తరవాత అన్నపూర్ణ  ప్రొడక్షన్ పైన పలు సినిమాలను నిర్మించి మంచి నిర్మాత అని కూడా ప్రూవ్ చేసుకున్నారు.. ఆయన తండ్రి మెయిన్ లీడ్ లో నటించిన శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి, ఇద్దరు ఇద్దరే, అగ్నిపుత్రుడు సినిమాలని నిర్మించారు..

ఇక అటు మెగాస్టార్ కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్... చేసిన రెండో సినిమాతోనే భారీ హిట్ కొట్టాడు రామ్ చరణ్.. ఇక తన తండ్రి రీఎంట్రీమూవీ ఖైది సినిమాని కొణిదెల ప్రొడక్షన్ అనే సంస్థని ప్రారంభించి తానే నిర్మాతగా వ్యవహరించి తిరిగి తండ్రిని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు చరణ్ .. ఆ తర్వాత సైరా చిత్రాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఆచార్య అనే సినిమాని నిర్మిస్తున్నాడు.

ఇలా నాగార్జున, రామ్ చరణ్ కలిసి వాళ్ళ తండ్రులతో కలిసి సినిమాలు నిర్మించి హీరోలుగా రికార్డులకు ఎక్కారు. అయితే ఇందులో నాగార్జున ఇంకో అడుగు ముందుకు వేసి కొడుకులు, అల్లుళ్ళతో కూడా సినిమాలని తెరక్కించారు. ఇక అంతకుముందు హరికృష్ణ కూడా అయన తండ్రి ఎన్టీ రామారావు చేసిన సినిమాలను నిర్మాతగా వ్యవహరించారు కానీ పూర్తి స్థాయి హీరోగా హరికృష్ణ కొనసాగలేదు.. ఇక భవిష్యత్తులో మరెవరైనా తమ తండ్రుల సినిమాలకి నిర్మాతగా వ్యవహరించి సక్సెస్ అవుతారో చూడలి. 

Tags:    

Similar News