స్టార్ హీరో కూతురుకు కూడా కాస్టింగ్ కౌచ్ బాధలు తప్పలేదట!
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఎంత మంచి నటినో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ గా ఇప్పుడు ఆమెకి అవకాశాలు తక్కువైయ్యాయి కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా బాగానే రాణిస్తుంది.
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఎంత మంచి నటినో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ గా ఇప్పుడు ఆమెకి అవకాశాలు తక్కువైయ్యాయి కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా బాగానే రాణిస్తుంది. విజయ్ హీరోగా వచ్చిన సర్కార్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో కూడా నటించి మంచి పేరును సంపాదించుకుంది. తాజాగా రవితేజ హీరోగా వస్తున్న క్రాక్ సినిమాలో కూడా పవర్ ఫ్ఫుల్ పాత్రలో నటిస్తోంది.
తమిళ్ నటుడు శరత్ కుమార్ కుమార్ కుమార్తె అయిన వరలక్ష్మి అవకాశాలు కూడా అంత ఈజీగా ఎం రాలేదట! తనకి కూడా కాస్టింగ్ కౌచ్ బాధలు ఎదురయ్యాయని చెబుతుంది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని ఆమె ద్రువికరించింది. తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిసి కూడా పలువురు నిర్మాతల నుంచి సెక్సువల్ ఫేవర్ అడిగే ధైర్యం చేశారని ఆమె పేర్కోంది. కానీ వాటికీ నో చెప్పానని ఆమె స్పష్టం చేసింది.
ఇక ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేవాళ్ళు వీటికి నో చెబుతూ దైర్యంగా ఉండాలని వరలక్ష్మి వెల్లడించింది. అవకాశం వచ్చేవరకు ఎదురుచూడాలని వచ్చాక మాత్రం మన ప్రతిభను నిరూపించుకోవాలని అంటుంది. ఇండస్ట్రీలో నిలబడాలంటే రెండు మార్గాలని అనుసరించలని, కాస్టింగ్ కౌచ్ ఒత్తిళ్లకు కాంప్రమైజ్ కావడం, లేదా నో చెప్పడమేనని వరలక్ష్మి వెల్లడించింది. రెండోదాని వల్ల అవకాశాలు కచ్చితంగా రాకపోవచ్చు. ఎందుకంటే దానివలనే తన కెరీర్ ప్రారంభంకావడానికి ఆలస్యమైందని వరలక్ష్మి వెల్లడించింది.