Sankranti 2026 Movies OTT: ఓటిటిలో సందడి చేయనున్న సంక్రాంతి సినిమాలు.. మూవీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!
Sankranti 2026 Movies OTT: ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ నుంచి ఏకంగా ఐదు సినిమాలు థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించాయి. రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా రాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి.
Sankranti 2026 Movies OTT: ఓటిటిలో సందడి చేయనున్న సంక్రాంతి సినిమాలు.. మూవీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!
Sankranti 2026 Movies OTT: ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ నుంచి ఏకంగా ఐదు సినిమాలు థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించాయి. రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా రాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. అయితే వర్క్ బిజీ షెడ్యూల్ వల్ల థియేటర్లకు కొందరు సినీ లవర్స్ థియేటర్ వెళ్లి సినిమాలు చూడలేకపోయారు. అలాంటి ఇప్పుడు ఓటీటీ వేదికగా డబుల్ ట్రీట్ సిద్ధమవుతోంది. సంక్రాంతి రేస్‌లో నిలిచిన సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ విషయానికి వస్తే.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో ముందుగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. దీంతో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ వెయిట్‌కు ఫుల్ స్టాప్ పెడుతూ జియో హాట్‌స్టార్ ఫిబ్రవరి 6 నుంచి రాజాసాబ్ సినిమాని స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
ఇక టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ థియేటర్లలో ఆలస్యంగా విడుదలైనా మంచి టాక్ తెచ్చుకుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అయితే థియేటర్లలో కంటే ముందే ఓటీటీలోకి వస్తుండటం విశేషం. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 4 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓటీటీ డేట్ కూడా ఫిక్స్ అయినట్టు సమాచారం. ఈ సినిమాకు డిజిటల్ హక్కులు దక్కించుకున్న జీ 5 సంస్థ ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషల్లోనూ ఈ సినిమా ఓటిటిలోకి రానుందని తెలుస్తోంది. ఇవే కాకుండా మాస్ మహారాజ రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా రాజు’ సినిమాలు కూడా త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్నాయి. అధికారిక తేదీలు త్వరలో ప్రకటించే అవకాశముంది. మొత్తానికి సంక్రాంతి సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తుండటంతో హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ జోష్‌లోకి రానుంది. థియేటర్‌లో మిస్ అయినవారు, మరోసారి చూడాలనుకునే వారు.. ఓటీటీలో ఎంజాయ్ చేయనున్నారు.