Mrunal Thakur: ధనుష్‌తో కాదు..ఆ యంగ్ హీరోతో మృణాల్ ఠాకూర్ సీక్రెట్ రిలేషన్‌షిప్....?
Mrunal Thakur: టాలీవుడ్ వెండితెర 'సీతమ్మ' మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.
Mrunal Thakur: టాలీవుడ్ వెండితెర 'సీతమ్మ' మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. 'సీతారామం', 'హాయ్ నాన్న' సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ భామ, తన వ్యక్తిగత జీవితం విషయంలో మరోసారి వార్తల్లో నిలిచారు. నిన్నటి వరకు ధనుష్‌తో డేటింగ్ అంటూ వచ్చిన వార్తలకు బ్రేక్ పడగా, ఇప్పుడు సరికొత్తగా బాలీవుడ్ యంగ్ హీరో పేరు తెరపైకి వచ్చింది.
బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో ప్రేమలో ఉందంటూ వస్తున్న వార్తలు ఇండస్ట్రీని ఊపేస్తున్నాయి. గతంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో మృణాల్ పెళ్లి అంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని మృణాల్ టీమ్ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఆ రూమర్లకు పూర్తిగా చెక్ పడగా, సిద్ధాంత్‌తో ఆమె క్లోజ్‌నెస్ కొత్త చర్చకు దారితీసింది.
ప్రమోషన్ల సాకుతో.. ప్రేమాయణమా?
వీరిద్దరూ కలిసి నటించిన తాజా చిత్రం ‘దో దీవానే సేహర్ మేన్’ ఫిబ్రవరి 2026లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లలో వీరిద్దరి మధ్య కనిపిస్తున్న కెమిస్ట్రీ, సాన్నిహిత్యం చూస్తుంటే.. ఇది కేవలం ప్రొఫెషనల్ బాండింగ్ మాత్రమే కాదు అంతకు మించే ఏదో ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పబ్లిక్ ఈవెంట్లలో వీరి బాడీ లాంగ్వేజ్ , సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కురిపించుకుంటున్న ప్రేమ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
వైరల్ అవుతున్న 'దో దీవానే' రీల్స్
ఇటీవల సిద్ధాంత్ చతుర్వేది తన సోషల్ మీడియాలో సినిమా టైటిల్ సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టి మృణాల్‌తో కలిసి ఉన్న రీల్స్‌ను షేర్ చేయడంతో ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. ధనుష్ కేవలం కవరింగ్ మాత్రమే.. అసలు స్టోరీ ఇక్కడ ఉంది అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. భన్సాలి ప్రొడక్షన్స్ వంటి భారీ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కోసమే ఈ హైప్ క్రియేట్ చేస్తున్నారా? లేక నిజంగానే మృణాల్-సిద్ధాంత్ కొత్త జంటగా అవతరించబోతున్నారా? అన్నది తేలాల్సి ఉంది.