Varanasi Box Office: రూ.3000 కోట్లు పక్కా.. బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్న ‘వారణాసి’?
Varanasi Movie Box Office: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘వారణాసి’. ఈ సినిమా రెండు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Varanasi Box Office: రూ.3000 కోట్లు పక్కా.. బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్న ‘వారణాసి’?
Varanasi Movie Box Office: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘వారణాసి’. ఈ సినిమా రెండు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వారణాసి రిలీజ్ డేట్ లాక్ అయినట్లు గురువారం నెట్టింట న్యూస్ చక్కర్లు కొట్టాయి. ఈరోజు మరోసారి వారణాసి మూవీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు ఫిక్స్ అవుతున్న రిలీజ్ డేట్ బాక్సాఫీస్ పరంగా గోల్డెన్ పీరియడ్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా పండుగలు, లాంగ్ వీకెండ్స్ కలిసి రావడం వల్ల వారణాసి వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
వారణాసి రిలీజ్ డేట్ 2027 ఏప్రిల్ 7న లాక్ అయినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 6న (మంగళవారం) యూఎస్ఏ ప్రీమియర్స్ జరగనున్నాయి. తర్వాతి రోజు ఏప్రిల్ 7న ఉగాది పండుగ ఉండటం తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు భారీ ఓపెనింగ్స్ రానున్నాయి. ఏప్రిల్ 10, 11 తేదీల్లో వీకెండ్ రావడం వల్ల తొలి వారం వసూళ్లు భారీగా వచ్చే అవకాశముంది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 15న శ్రీరామ నవమి వంటి సెలవులు వరుసగా ఉండటం సినిమాకు మరింత కలిసివచ్చే అంశం. ఏప్రిల్ 17, 18 తేదీల్లో మరోసారి వీకెండ్ వస్తుండడంతో.. రెండో వారం కూడా బాక్సాఫీస్ పరుగులు పెట్టనుంది. ఈ మొత్తం క్యాలెండర్‌ను పరిశీలిస్తే.. వారణాసికి బెస్ట్ రిలీజ్ డేట్ అని చెప్పొచ్చు.
పండుగలు, సెలవులు, వీకెండ్స్ అన్నీ ఒకేసారి కలిసిరావడంతో వారణాసి రూ.3000 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తుందా? అనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. కంటెంట్ బలంగా ఉంటే మాత్రం ఈ రిలీజ్ డేట్ సినిమాకు భారీ అడ్వాంటేజ్‌గా మారడం ఖాయం. మొదటి రోజు ఈ సినిమా రూ.300 నుంచి రూ.400 సాధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. లాంగ్ రన్‌లో మాత్రం మూడు వేలకు పైగా సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి వారణాసి బాక్సాఫీస్ చరిత్రను ఎలా మార్చబోతోందో చూడాలి. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన గ్లోబల్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా నటిస్తున్నారు. స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రల్లో కనిపించనున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో వారణాసి రూపొందుతోంది. ఈ సినిమాపై భారతీయ సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.