Varanasi Release Date: వాటే ప్లానింగ్ రాజమౌళి గారు.. 'వారణాసి' రిలీజ్ డేట్ ఫిక్స్?
Varanasi Release Date: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’. ఈ చిత్రం ఇప్పటికే భారతీయ సినీ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని కలిగిస్తోంది.
Varanasi Release Date: వాటే ప్లానింగ్ రాజమౌళి గారు.. 'వారణాసి' రిలీజ్ డేట్ ఫిక్స్?
Varanasi Release Date: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’. ఈ చిత్రం ఇప్పటికే భారతీయ సినీ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రంలో గ్లోబల్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా, స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారీ బడ్జెట్, గ్రాండ్ స్కేల్‌లో వారణాసి రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టుగా కొన్ని హోర్డింగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
వారణాసి నగరం అంతటా అనూహ్యంగా అనేక హోర్డింగ్స్ దర్శనమివ్వడం ఇప్పుడు నెట్టింట ఆసక్తికరంగా మారింది. ఈ హోర్డింగ్స్‌పై ఎలాంటి వివరాలు లేకుండా.. కేవలం 'April 7, 2027 – In Theaters' అని మాత్రమే అని ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా కనిపించిన ఈ హోర్డింగ్స్.. వారణాసి రిలీజ్ డేట్‌ను కన్ఫామ్ చేసినట్టే అని టాక్. ఎవరి పేరు, సినిమా పోస్టర్, హీరో వివరాలు లేకుండా.. పోస్టర్ పై కేవలం రిలీజ్ డేట్ మాత్రమే చూపించడం రాజమౌళి ప్రమోషన్స్‌లో కొత్త స్ట్రాటజీగా ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా.. ఇలా విడుదల తేదీని మాత్రమే రిలీజ్ చేయడంతో సరికొత్త మార్కెటింగ్ ట్రిక్‌ను చిత్ర యూనిట్ ఉపయోగిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ హోర్డింగ్స్ వెనుక ఏదో పెద్ద ప్లాన్ ఉందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 2027 ఉగాది కానుకగా రిలీజ్ కానున్న వారణాసి.. సమ్మర్ హాలీడేస్‌ను క్యాష్ చేసుకోనుంది. 2027 ఏప్రిల్ 7న వారణాసి థియేటర్లోకి రావడం ఫిక్స్ అయినట్టేనని హోర్డింగ్స్ ద్వారా అర్ధమవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్ ప్రియాంకా చోప్రా కూడా జాయిన్ అయ్యారు. ఫిబ్రవరి 18వ తేదీ వరకు వారణాసి సెట్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనున్నట్లు తెలుస్తోంది. వారణాసి నుంచి ఇప్పటికే మూడు క్యారెక్టర్స్ పరిచయం అయ్యాయి. మహేష్ బాబు, ప్రియాంక, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలను చిత్ర యూనిట్ పరిచయం చేసింది. దాంతో సినిమాపై భారీ హైప్ నెలకొంది. విడుదలకు ఇంకా ఏడాది ఉన్నా.. వారణాసి అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుందని చెబుతున్నారు.