Anil Ravipudi-Venkateh: అనిల్–వెంకీ కాంబో.. క్రేజీ అప్డేట్ మామ!
'మెగాస్టార్' చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా అనంతరం సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో క్రేజీ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు.
Anil Ravipudi-Venkateh: అనిల్–వెంకీ కాంబో.. క్రేజీ అప్డేట్ మామ!
'మెగాస్టార్' చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా అనంతరం సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో క్రేజీ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలు బ్లాక్‌బస్టర్లతో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ను ఏర్పరుచుకున్న అనిల్.. విక్టరీ వెంకటేష్‌తో మరోసారి చేతులు కలపనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం స్క్రిప్ట్ డెవలప్‌మెంట్ దశలోకి ప్రవేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నెక్స్ట్ సినిమా కథ లైన్ సెట్ అయ్యిందని అనిల్ చెప్పిన విషయం తెలిసిందే. అది వెంకీ సినిమా కోసమే అని ఇండస్ట్రీలో హాట్ టాక్ నడుస్తోంది.
ఈ సినిమాలో వెంకటేష్‌కు సమానమైన ప్రాధాన్యం ఉన్న కీలక పాత్ర కోసం స్టార్ నటులను అనిల్ రావిపూడి పరిశీలిస్తున్నారట. తమిళ స్టార్ హీరో కార్తి లేదా నేషనల్ అవార్డ్ విన్నర్ ఫహాద్ ఫాసిల్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ఇద్దరిలో ఒకరు వెంకీ సినిమాలో నటించనున్నారట. ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ ప్రాజెక్ట్‌లో చేరితే.. సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. కార్తీ మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కింగ్ నాగార్జునతో ఊరిపి సినిమా చేశారు. గతేడాది అరవింద స్వామితో కలిసి సత్యం సుందరం చేశారు. ఈ రెండు సినిమాల్లో కార్తీ నటన మరో స్థాయిలో ఉంటుంది. మరోవైపు ఫహాద్ ఫాసిల్ కూడా పుష్ప సినిమాతో ఆకట్టుకున్నారు.
కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జానర్‌లో తన మార్క్ చూపించే డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఈసారి కూడా వెంకటేష్ ఇమేజ్‌కు తగ్గట్టుగా కథను సిద్ధం చేస్తున్నారని టాక్. స్క్రిప్ట్ పూర్తయ్యాక అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాను సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే అనిల్-వెంకీ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనిల్ తీసిన మన శంకరవరప్రసాద్ గారులో కూడా అతిథి పాత్రలో వెంకీ మామ ఇరగదీశారు. అందుకే అనిల్-వెంకీ సినిమా అధికారిక అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.