మెగా బాస్ రికార్డుల రచ్చ.. ‘మన శంకరవరప్రసాద్ గారు’ 17 రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?

'మెగాస్టార్' చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. సక్సెఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

Update: 2026-01-29 12:22 GMT

'మెగాస్టార్' చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. సక్సెఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. 2026 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా.. 17 రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ.283.19 కోట్ల గ్రాస్ వసూళ్లతో మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అభిమానులు, ట్రేడ్ వర్గాలు అంచనా వేసిన దానికంటే ఎక్కువగా వరప్రసాద్ గారు కలెక్షన్స్ రాబట్టారు. ప్రస్తుతం మెగాస్టార్ ఈ సినిమా విజయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మన శంకరవరప్రసాద్ గారు సినిమా ప్రభంజనమే సృష్టించింది. ఏపీ, తెలంగాణ కలిపి 213.27 కోట్ల రూపాయలు వసూలు చేసి.. సంక్రాంతి సీజన్‌లో నెంబర్ వన్ చిత్రంగా నిలిచింది. కర్ణాటకలో రూ.21.40 కోట్లు, తమిళనాడులో రూ.3.02 కోట్లు సాధించింది. కేరళలోనూ పరిమిత విడుదల మధ్య రూ.9 లక్షలు రాబట్టింది. ఒడిశా, వెస్ట్ బెంగాల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కలిపి రూ.88 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.2.43 కోట్లు వసూలు చేసింది. మొత్తం డొమెస్టిక్ కలెక్షన్ రూ.241.09 కోట్ల రూపాయలకు చేరింది.

ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ‘మన శంకరవరప్రసాద్ గారు’ సత్తా చాటింది. 17 రోజుల్లో 4.59 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 42.10 కోట్లు) వసూళ్లు సాధించి.. మెగాస్టార్ చిరంజీవి గ్లోబల్ క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. డొమెస్టిక్, ఓవర్సీస్ కలిపి వరల్డ్‌వైడ్ గ్రాస్ 283.19 కోట్ల రూపాయలు నమోదు కావడం విశేషం. ఈ చిత్రంలో చిరంజీవి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌కు తోడు లేడీ సూపర్ స్టార్ నయనతార, విక్టరీ వెంకటేష్ పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కథ, సంగీతం, ఎలివేషన్లతో ఫ్యాన్స్‌కు పూర్తి పండుగ ట్రీట్ అందించిన ఈ సినిమా.. ప్రస్తుతం రూ.300 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. సంక్రాంతి బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచిన ‘మన శంకరవరప్రసాద్ గారు’.. తెలుగు రీజినల్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News