Shruti Haasan: సిగరెట్ తాగుతూ కనిపించిన శ్రుతి హాసన్

Shruti Haasan: దుల్కర్ సల్మాన్ మ్యాజిక్, పవన్ సాదినేని విజన్ కలగలిసిన క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆకాశంలో ఒక తార’

Update: 2026-01-29 07:22 GMT

Shruti Haasan: సిగరెట్ తాగుతూ కనిపించిన శ్రుతి హాసన్

Shruti Haasan: దుల్కర్ సల్మాన్ మ్యాజిక్, పవన్ సాదినేని విజన్ కలగలిసిన క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆకాశంలో ఒక తార’. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ ప్రేక్షకుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తోంది. తాజాగా వర్సటైల్ బ్యూటీ శృతి హాసన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ఈ పోస్టర్‌లో శృతి హాసన్ లుక్ ఎవరూ ఊహించని విధంగా ఉంది. కళ్ళకు అద్దాలు, పెదవుల మధ్య సిగరెట్, ఆ పొగ మేఘాల మధ్య కనిపిస్తున్న ఆమె ఇంటెన్స్ లుక్ చూస్తుంటే.. ఈ సినిమాలో ఆమె పాత్ర ఎంత రఫ్ అండ్ గ్రిట్టీగా ఉండబోతుందో అర్థమవుతోంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే పవర్‌ఫుల్ రోల్‌లో శృతి అదరగొట్టబోతోంది.

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ల సమర్పణలో సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లిని పరిచయం చేసిన మేకర్స్, ఇప్పుడు శృతి హాసన్ లాంటి స్టార్ ప్లేయర్‌ను రంగంలోకి దించడం సినిమా స్థాయిని మరింత పెంచింది. దుల్కర్ క్లాస్, శృతి మాస్ కలయికలో రాబోతున్న ఈ విలక్షణ చిత్రం వెండితెరపై కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News