Ramayana Movie: ‘రామాయణం’కు 2026లో బిగ్గెస్ట్ హాలిడే వీక్.. ఇండియన్ సినిమా రికార్డులన్నీ బద్దలే!

Ramayana Movie: ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ‘రామాయణం’ సినిమా 2026లో విడుదలైతే ఎలాంటి సంచలనం సృష్టించబోతోందో ఇప్పటి నుంచే అంచనా మొదలయ్యాయి.

Update: 2026-01-28 11:12 GMT

Ramayana Movie: ‘రామాయణం’కు 2026లో బిగ్గెస్ట్ హాలిడే వీక్.. ఇండియన్ సినిమా రికార్డులన్నీ బద్దలే!

Ramayana Movie: ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ‘రామాయణం’ సినిమా 2026లో విడుదలైతే ఎలాంటి సంచలనం సృష్టించబోతోందో ఇప్పటి నుంచే అంచనా మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమాకు లభిస్తున్న హాలిడే అడ్వాంటేజ్‌పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. నవంబర్ 2026లో వరుసగా పండుగలు రావడంతో ‘రామాయణం’కి ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద హాలిడే వీక్ దక్కనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

నవంబర్ 6 నుంచి 11 వరకు వరుసగా దంతేరస్, దీపావళి, గోవర్ధన్ పూజ, భాయ్ దూజ్ వంటి ప్రధాన పండుగలు ఉన్నాయి. అంతేకాదు నవంబర్ 9న ఎక్స్‌టెండెడ్ హాలిడే కూడా రావడంతో రామాయణం సినిమాకు లాంగ్ వీకెండ్ ప్లస్ ఫెస్టివల్ అడ్వాంటేజ్ దక్కనుంది. దీని వల్ల తొలి వారం కలెక్షన్లు రికార్డ్ స్థాయిలో నమోదు అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా నవంబర్ 13 నుంచి 16 వరకు ఛఠ్ పూజ హాలిడేస్ ఉండటం ఉత్తరాది మార్కెట్‌లో సినిమాకు మరింత బలం చేకూర్చనుంది. ఆ తర్వాత నవంబర్ 24న గురు నానక్ జయంతి హాలిడే కూడా రావడం వల్ల రెండో, మూడో వారాల్లోనూ బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ ప్రభంజనం కొనసాగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో నవంబర్ 11 నాటికే ఇండియన్ సినిమా చరిత్రలో ఉన్న చాలా రికార్డులు రామాయణంతో బద్దలవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పండుగల సీజన్, మాస్ ఆడియన్స్ హాజరు, ఫ్యామిలీ వ్యూయింగ్.. అన్నీ కలిసొస్తే బాక్సాఫీస్ వద్ద సునామీ తప్పదని అంటున్నారు. రామాయణంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, కన్నడ స్టార్ యశ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు స్టార్‌లు కలసి చేస్తున్న ఈ మైథలాజికల్ ఎపిక్ ఇండియన్ సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్తుందని అందరూ భావిస్తున్నారు. భారీ విజువల్స్, ప్రపంచ స్థాయి మేకింగ్, పాన్ ఇండియా కాస్టింగ్‌తో రామాయణం ఇండియన్ సినిమా రూపురేఖలనే మార్చే చిత్రంగా నిలుస్తుందనే హైప్ ఇప్పటికే నేషనల్ లెవల్‌లో మొదలైంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే 2026 దీపావళి సీజన్ రామాయణం పేరుతో ఇండియన్ సినిమా చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయంగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News