Sravana Bhargavi: లైఫ్‌లో చిన్న చిన్న గొడవలు కామన్.. కానీ చివరకు అలా జరిగిపోయింది..!
Sravana Bhargavi: టాలీవుడ్ పాపులర్ సింగర్ శ్రావణ భార్గవి అంటే కేవలం మధురమైన గొంతు మాత్రమే కాదు.. బోల్డ్ అండ్ క్లారిటీ ఉన్న వ్యక్తిత్వం.
Sravana Bhargavi: టాలీవుడ్ పాపులర్ సింగర్ శ్రావణ భార్గవి అంటే కేవలం మధురమైన గొంతు మాత్రమే కాదు.. బోల్డ్ అండ్ క్లారిటీ ఉన్న వ్యక్తిత్వం. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారాల మధ్య, ఆమె తన మనసులోని మాటలను ఎంతో పరిణతితో పంచుకున్నారు. తన తల్లిదండ్రులతో అనుబంధం నుంచి తెలుగు సంగీత పరిశ్రమలోని లోపాల వరకు ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రతి ఇంట్లో లాగే శ్రావణ భార్గవి జీవితంలోనూ తల్లితో చిన్న చిన్న గొడవలు ఉండేవట. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. టీనేజ్‌లో ఉన్నప్పుడు అమ్మ ఏదైనా నేరుగా ముక్కుసూటిగా చెబితే నాకు నచ్చేది కాదు. కానీ, ఈరోజు నేను ఒక తల్లిని అయ్యాక, నా కూతురి విషయంలో నేను కూడా అలాగే ప్రవర్తిస్తున్నాను. అప్పుడు మా అమ్మ నా కోసం ఎంత ఇబ్బంది పడిందో ఇప్పుడు అర్థమవుతోంది అంటూ అమ్మపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు.
ఇక తండ్రి గురించి చెబుతూ, ఆయన ప్రేమను వ్యక్తపరిచే విధానం చాలా డిఫరెంట్‌గా ఉండేదని తెలిపారు. నాన్న నాకు ఖరీదైన వస్తువులు కొనిచ్చేవారు. చిన్నప్పుడు అదేదో కఠినంగా అనిపించేది, కానీ 20 ఏళ్లు దాటాక నాన్న నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యారు. ఆయన ప్రేమను వస్తువుల రూపంలో చూపించేవారని ఇప్పుడు గ్రహించాను అని చెప్పుకొచ్చారు. సింగర్‌గా తనకంటూ ఒక ఇమేజ్ ఉన్నప్పటికీ, ఇండిపెండెంట్ మ్యూజిక్ విషయంలో తెలుగు ఇండస్ట్రీ వెనుకబడి ఉందని శ్రావణ భార్గవి ఆవేదన వ్యక్తం చేశారు. హిందీలో వార్నర్ మ్యూజిక్, యూనివర్సల్ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి.
తమిళంలోనూ థింక్ మ్యూజిక్ వంటివి స్వతంత్ర కళాకారులను ప్రోత్సహిస్తున్నాయి. కానీ తెలుగులో అలాంటి సపోర్ట్ సిస్టమ్ లేదు. ఒక స్వతంత్ర పాట చేయాలంటే.. నేనే రాసుకోవాలి, నేనే ట్యూన్ కట్టాలి, షూటింగ్ చూసుకోవాలి, మార్కెటింగ్ కూడా నేనే చేయాలి. ఇది చాలా భారంతో కూడుకున్న పని. తెలుగులో కూడా త్వరలో మంచి మ్యూజిక్ లేబుల్స్ వస్తాయని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. అప్పటివరకు తన పోరాటం ఆగదని, తన పాటలను తానే స్వయంగా విడుదల చేసుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.