Priyanka Chopra: మా మధ్య విభేదాలు ఉన్నాయ్.. విడాకులపై తొలిసారి స్పందించిన ప్రియాంక చోప్రా
Priyanka Chopra: దేశీ గర్ల్ నుంచి గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఒకవైపు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 'వారణాసి' వంటి భారీ ప్రాజెక్టుతో బిజీగా ఉంటూనే, మరోవైపు తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు.
Priyanka Chopra: మా మధ్య విభేదాలు ఉన్నాయ్.. విడాకులపై తొలిసారి స్పందించిన ప్రియాంక చోప్రా
Priyanka Chopra: దేశీ గర్ల్ నుంచి గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఒకవైపు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 'వారణాసి' వంటి భారీ ప్రాజెక్టుతో బిజీగా ఉంటూనే, మరోవైపు తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు. ఇటీవల ఒక అంతర్జాతీయ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ప్రియాంక, నిక్ జోనస్‌తో తన వైవాహిక బంధం గురించి ఎవరూ ఊహించని విషయాలను పంచుకున్నారు.
2018లో నిక్ జోనస్‌ను వివాహం చేసుకున్న ప్రియాంక, తమ పరిచయం గురించి చెబుతూ.. ఆస్కార్ అవార్డుల పార్టీలో మా మధ్య స్నేహం మొదలైంది. అభిరుచులు కలవడంతో అది ప్రేమగా మారింది. ప్రస్తుతం మా కూతురు మాల్తీ మేరీతో మా జీవితం ఎంతో సంతోషంగా సాగుతోందని ఆమె వివరించారు. రెండు వేర్వేరు దేశాలు, సంస్కృతులకు చెందిన వ్యక్తులు కలిసినప్పుడు ఇబ్బందులు రావడం సహజమని ప్రియాంక ఓపెన్‌గా ఒప్పుకున్నారు.
నేను సంప్రదాయ భారతీయ కుటుంబం నుంచి వచ్చాను, నిక్ అమెరికన్. ఆరంభంలో వాళ్ల మాట తీరు, ప్రవర్తన నాకు చాలా వింతగా అనిపించేవి. ముఖ్యంగా వాళ్ల ఇంట్లో అందరూ చాలా నెమ్మదిగా, క్రమశిక్షణతో మాట్లాడేవారు. మనలా వేగంగా మాట్లాడటం వాళ్లకు అలవాటు లేదు. ఎదుటివారు మాట్లాడేటప్పుడు మధ్యలో జోక్యం చేసుకోవడం వాళ్ల సంస్కృతిలో లేదు. ఇది నేర్చుకోవడానికి నాకు కొంత సమయం పట్టిందని ఆమె తెలిపారు.
గత కొంతకాలంగా ప్రియాంక-నిక్ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె గట్టిగానే స్పందించారు. ప్రతి దాంపత్యంలోనూ సమస్యలు ఉంటాయి. సెలబ్రిటీలైనా, సామాన్యులైనా జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ముఖ్యం. సంస్కృతుల పరంగా మా మధ్య కొన్ని చిన్న చిన్న విభేదాలు ఉన్న మాట నిజమే కానీ, మేము విడిపోతున్నామన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. డైవోర్స్ అనేది కేవలం రూమర్ మాత్రమే అని స్పష్టం చేస్తూ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టారు. ప్రస్తుతం తన ప్రొఫెషనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక, మహేష్ బాబు సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.