Sobhita Dhulipala: నాగ చైతన్యతో పెళ్లైనప్పటి నుంచి ఒక్కసారి కూడా ఆ పని చేయలేదు

Sobhita Dhulipala: అక్కినేని కోడలిగా అడుగుపెట్టిన నాటి నుండి శోభిత ధూళిపాళ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది.

Update: 2026-01-31 09:27 GMT

Sobhita Dhulipala: అక్కినేని కోడలిగా అడుగుపెట్టిన నాటి నుండి శోభిత ధూళిపాళ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ బ్యూటీ, పెళ్లి తర్వాత తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యంగా తాజాగా ఆమె వంట గది గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

సాధారణంగా పెళ్లైన తర్వాత తెలుగింటి కోడళ్లు వంటింట్లో అడుగుపెట్టి కొత్త వంటకాలు వడ్డిస్తుంటారు. కానీ శోభిత మాత్రం అందుకు పూర్తి భిన్నం. పెళ్లి జరిగిన నాటి నుండి ఇప్పటి వరకు తాను ఒక్కసారి కూడా వంటింట్లో ప్రయోగాలు చేయలేదని ఆమె స్పష్టంగా చెప్పేసింది. వంట చేయడం కంటే, నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ ఇచ్చి ఎంజాయ్ చేయడమే తనకు ఇష్టమని ఆమె మనసులో మాట బయటపెట్టింది.

కేవలం ఖరీదైన రెస్టారెంట్లు మాత్రమే కాదు, రోడ్డు పక్కన దొరికే పునుగులు, సమోసాలు, మిరపకాయ బజ్జీలు అంటే శోభితకు అమితమైన ఇష్టమట. ఎంతలా అంటే, హైదరాబాద్‌లో బెస్ట్ టిఫిన్స్ ఎక్కడ దొరుకుతాయో చెప్పమని తన సినిమా దర్శకుడిని సైతం అడుగుతుందట. నాగచైతన్యకు చెందిన 'షోయూ' రెస్టారెంట్ ఉన్నప్పటికీ, రకరకాల హోటల్స్ నుండి ఫుడ్ టేస్ట్ చేయడం ఆమెకో అలవాటుగా మారిపోయింది.

నేను బాగా తింటాను, కానీ అంతే స్థాయిలో వర్కౌట్స్ కూడా చేస్తానని శోభిత చెప్పుకొచ్చింది. సెలబ్రిటీలు డైట్ విషయంలో చాలా కఠినంగా ఉంటారనే అంచనాలను పటాపంచలు చేస్తూ, తను ఒక పక్కా ఫుడ్ లవర్ అని నిరూపించుకుంది. రోజువారీగా ఫుడ్ ఆర్డర్ అంటే ఖర్చు మామూలుగా ఉండదు కదా అని కొందరు ఆశ్చర్యపోతుంటే, నీ నిజాయితీకి హాట్సాఫ్ అని మరికొందరు ఆమెను మెచ్చుకుంటున్నారు.ఆమె చేసిన ఈ కామెంట్స్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం శోభిత నటించిన ‘చీకటిలో’ క్రైమ్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోంది.

Tags:    

Similar News