Pawan Kalyan : పవన్ బర్త్ డే గిఫ్ట్ రెడీ!
Pawan Kalyan : అజ్ఞాతవాసి సినిమా తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఈ సినిమా తర్వాత పవన్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లారు.
Vakeel saab movie
Pawan Kalyan : అజ్ఞాతవాసి సినిమా తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఈ సినిమా తర్వాత పవన్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లారు. ప్రస్తుతం పవన్ రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ అనే సినిమా తెరకెక్కుతుంది. ఇది పవన్ కళ్యాణ్ కి 26 వ చిత్రం కావడం విశేషం.. .ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ కపూర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు..
అయితే రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఉంటుదని ఫ్యాన్స్ చాలా ఆశగా ఉన్నారు. అయితే కొద్ది సేపటి క్రితం చిత్ర నిర్మాతలు బోని కపూర్, దిల్ రాజు రేపు ఉదయం 9గం.ల 9 నిమిషాలకి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టుగా ఆఫీషియల్ గా వెల్లడించారు. అయితే ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా నుంచి ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది.. దీనితో సినిమా నుంచి టీజర్ ఉంటుందని ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
We have something to show you tomorrow at 9:09AM !!!@PawanKalyan@i_nivethathomas @yoursanjali @SVC_official @BayViewProjOffl #SriramVenu @MusicThaman#PSPK26#VakeelSaab
— Boney Kapoor (@BoneyKapoor) September 1, 2020
ఇక అటు పవన్ కళ్యాణ్ 28 వ చిత్రానికి సంబంధించి కూడా అప్డేట్ రానుంది. ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆఫీషియల్ గా వెల్లడించింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించే ఈ చిత్రానికి సంబంధించి సెప్టెంబర్ 02 సాయింత్రం 04 : 05 నిమిషాలకు ఓ అప్డేట్ ఉంటుందని స్పష్టం చేసింది. ఇక గతంలో హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ అనే చిత్రం రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంది. మళ్ళీ ఏనమిదేళ్ళ తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి..