Pawan kalyan : బిగ్ అప్డేట్ : సెప్టెంబర్ 02 సాయింత్రం 04 : 05 నిమిషాలకు

Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 02) సందర్భంగా ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ 28 వ సినిమాకి

Krishna
Updated on: 31 Aug 2020 6:47 PM IST
Pawan kalyan : బిగ్ అప్డేట్ : సెప్టెంబర్ 02 సాయింత్రం 04 : 05 నిమిషాలకు
X

Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 02) సందర్భంగా ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ 28 వ సినిమాకి సంబంధించిన బిగ్ అప్డేట్ రానుంది.. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించే ఈ చిత్రానికి సంబంధించి సెప్టెంబర్ 02 సాయింత్రం 04 : 05 నిమిషాలకు ఓ అప్డేట్ ఉంటుందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇక గతంలో హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ అనే చిత్రం రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంది. మళ్ళీ ఏనమిదేళ్ళ తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి..


అటు పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఇది పవన్ కి 26 వ చిత్రం కావడం విశేషం.. హిందీలో వచ్చిన పింక్ సినిమాకి ఇది రీమేక్ ..ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ క‌పూర్‌, దిల్ రాజు కలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది.

ఈ సినిమా నుంచి కూడా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. అటు క్రిష్ తో చేయబోయే సినిమా నుంచి అప్డేట్ ఉంటుందని తెలుస్తోంది.

Krishna

Krishna

Next Story