Uma Maheswara Ugra Roopasya : ఉమామహేశ్వర.. బుల్లితెర రికార్డస్య! ఇలా జరగడం ఇదే మొదటిసారి!

Uma Maheswara Ugra Roopasya : లాక్ డౌన్ కారణంగా ధియేటర్లు ముతపడడంతో ఓటీటీలోనే సినిమాలను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్..

Update: 2020-09-04 10:11 GMT

satya dev

Uma Maheswara Ugra Roopasya : లాక్ డౌన్ కారణంగా ధియేటర్లు ముతపడడంతో ఓటీటీలోనే సినిమాలను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.. అలా ఇప్పటివరకూ ఓటీటీ రిలీజ్ అయి మంచి టాక్ సంపాదించుకున్న అతి తక్కువ సినిమాలలో "ఉమామహేశ్వర ఉగ్రరూపస్య" ఒకటి.. సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి కంచరపాలెం ఫేం వెంకటేష్ మహా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. అంతేకాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం.. అయితే ఈ మూవీని మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు బుల్లితెర పైన ఈ సినిమాని చూసేయవచ్చు.. ఈ నెల 13న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈటీవీ మెయిన్ ఛానల్ లో సాయింత్రం ఆరు గంటలకి ఈ సినిమా ప్రసారం కానుంది.

ఈటీవీ టెలికాస్ట్ చేస్తున్న కొత్త సినిమా కూడా ఇదే కావడం విశేషం.. ఇంతకుముందు తమ దగ్గర ఉన్న పాత సినిమాలనే తిప్పుకుంటూ వేస్తూ వచ్చింది. అయితే మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని కొత్త సినిమాల పైన ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఈ మధ్య కంటెంట్ పరంగా చాలా కొత్తగా అనిపించిన ఈ చిత్రాన్ని బుల్లితెర ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సినిమాకి ప్రసారానికి మరో విశేషం కూడా ఉంది. డైరెక్ట్ గా ధియేటర్ లో రిలీక్ కాకుండా టీవీలో రాబోతున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం..

ఈ సినిమాని అనధికారికంగా డౌన్ లోడ్ చేసి లోకల్ ఛానల్స్ వాళ్ళు ఇల్లీగల్ గా వేశారు. అయితే అలాంటి సంస్థలపై సదరు ఛానల్ సీరియస్ అయిందట. దీనితో ఓ డేట్ ని లాక్ చేసి సినిమాని బుల్లితెర ప్రేక్షకులకి అందించడానికి అడుగు ముందుకు వేసింది. అలా ఈ నెల 13న సాయింత్రం ఆరు గంటలకు ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.. ధియేటర్లు లేకపోవడం, డిజిటల్ పైన అందరికి పెద్దగా అవగాహన లేకపోవడంతో బుల్లితెర పైన ఎక్కువ చూసే అవకాశం ఉంది కాబట్టి రేటింగ్స్ విషయంలో భారీ అంచనాలు ఉన్నాయి. 

Tags:    

Similar News