మిస్ మ్యాచ్ సింగిల్ విడుదల చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్
ఆటగాడరా శివా ఫేమ్ ఉదయ శంకర్ హీరోగా రూపొందిన సినిమా 'మిస్ మ్యాచ్'. ఈ సినిమా సింగిల్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ రోజు విడుదల చేశారు,
''మిస్ మ్యాచ్ సినిమా మొదటి పాట విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా దర్శకుడు సలీం ను ఇప్పుడే కలుస్తున్నాను. అయన చేసిన సలీం సినిమా చూసాను. అది తమిళంలోనూ, తెలుగు లోనూ హిట్ సినిమా. మిస్ మ్యాచ్ కూడా హిట్టవ్వాలని కోరుకుంటున్నాను. సాంగ్ చాలా బావుంది. ఉదయశంకర్ కు నా శుభాకాంక్షలు. సినిమా యూనిట్ అందరికీ అభినందనలు'' అన్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
ఆటగదరా శివ ఫేమ్ ఉదయ శంకర్ హీరోగా రూపొందిన సినిమా 'మిస్ మ్యాచ్'. ఈ సినిమా తొలి సింగల్ ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తొలి పాటను విడుదల చేసి విన్నారు. పాట బావుందనీ, సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నానని అయన చెప్పారు.
ఈ సందర్భంగా హీరో ఉదయ శంకర్ మాట్లాడుతూ, తన ఆల్ టైం ఫేవరేట్ దర్శకుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా తన సినిమా పాత విడుదల కావడం సంతోషంగా ఉందన్నారు. తనకు త్రివిక్రమ్ మొదట్నుంచీ సపోర్ట్ చేస్తున్నారనీ, మొదటి సినిమా ఆటగదా శివ సినిమా ట్రైలర్ ను త్రివిక్రమ్ విడుదల చేశారని గుర్తు చేసుకున్నారు. అరెరే అనే సాంగ్ ను త్రివిక్రమ్ విడుదల చేశారనీ, మెలోడీ పాట అనీ చెప్పారు. ఈ పాట చాలా బాగా వచ్చిందనీ. ఇది సిట్యువేషన్ సాంగ్ అనీ చెప్పారు. రంగస్థలం ఫేమ్ మానసి పాడిన ఈ పాటను శ్రేష్ఠ రాశారని వివరించారు.
దర్శకుడు నిర్మల్ మాట్లాడుతూ… '' త్రివిక్రమ్ అంటే నాకెంతో అభిమానం. ఆయన నా తొలి తెలుగు సినిమా తొలి పాత విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. సంగీత దర్శకుడు గిఫ్టన్ మాట్లాడుతూ..''మిస్ మ్యాచ్ సినిమాలో సంగీతాన్ని అందించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు. తొలి సింగిల్ ను త్రివిక్రమ్ విడుదల చేయడం అద్భుత అనుభూతిని ఇచ్చిందని చెప్పారు.
ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా 'అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న 'మిస్ మ్యాచ్' సినిమాలో ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా 'సలీం' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న'మిస్ మ్యాచ్' ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కధ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం, దర్శకుడు. ఎన్.వి.నిర్మల్ కుమార్ ., నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్