Celebrating Vinayaka Chavithi : టాలీవుడ్ సెలబ్రిటీల ఇంట కొలువుదీరిన గణనాథుడు!

Celebrating Vinayaka Chavithi : వినాయక చవితి వచ్చిందంటే చాలు.. వీధివీధికి గణపయ్య దర్శనం ఇస్తాడు.. భారీ విగ్రహాలు, మండపాలు ఏర్పాటుచేసి ఎంతో

Update: 2020-08-22 09:40 GMT

Tollywood Celebrates Celebrating Vinayaka Chavithi festival

Celebrating Vinayaka Chavithi : వినాయక చవితి వచ్చిందంటే చాలు.. వీధివీధికి గణపయ్య దర్శనం ఇస్తాడు.. భారీ విగ్రహాలు, మండపాలు ఏర్పాటుచేసి ఎంతో ఘనంగా వినాయక చవితిని చాలా గొప్పగా జరుపుకుంటారు తెలుగు రాష్ట్రాల ప్రజలు.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. కరోనా నేపధ్యంలో వీధుల్లో గణనాథులను ప్రతిష్టించడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వలేదు. దీనితో ఎవరు ఇంట్లో వాళ్ళే గణపయ్యని ప్రతిష్టించుకొని పూజలు చేసుకుంటున్నారు.. ఇక ఎక్కువ మంది తమ ఇళ్లలో మట్టి వినాయకులను ప్రతిష్టించుకోవడం మరో విశేషం అని చెప్పవచ్చు.. అటు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వినాయక చవితిని తమ ఇళ్లలో ఆనందంగా జరుపుకుంటున్నారు. తమ ఇంట్లోని గణపయ్యకి చేసిన పూజలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో గణపయ్యని పూజలు చేశారు. ఈ ఫొటోలను అయన తనయుడు రామ్ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా అయన చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

  ఇక ఈ మధ్యే కొత్తగా పెళ్లయిన యంగ్ హీరో నితిన్ తన భార్యతో కలిసి విగ్నేశ్వరుడికి పూజ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ట్వీట్ చేస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

అటు మెగా హీరో అల్లు అర్జున్ పూజ అనంతరం తన ఫ్యామిలీతో కలిసి తీసుకున్న ఓ ఫొటోను ట్వీట్ చేశారు.. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు వినాయ చవితి శుభాకాంక్షలు తెలిపారు.






Tags:    

Similar News