దర్శకుధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన మ్యాజిక్ బాహుబలి చిత్రం పలు దేశాల్లో ఇంకా ప్రేక్షకులను మెప్పిస్తుంది. భారతీయ సినిమా చరిత్రలో ఓ ఉత్తమ చిత్రంగా నిలిచిపోయింది. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పింది. బాహుబలి సిరీస్ సృష్టించిన విజయం అంతా ఇంత కాదు.. భారతదేశ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన చిత్రంగా నిలిచింది.
మూడేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా రిలీజైన బాహుబలి: ది కన్‌క్లూజన్ బాక్సాఫీస్‌ను రికార్డులతో కుదిపేసింది. ఇండియన్ సినిమా రికార్డులన్నింటిని తిరగరాసింది. ప్రపంచ సినీ చరిత్రలో ప్రత్యేకస్థానం సంపాదించిన బాహుబలి 2 సినిమా రష్యాలోనూ ఇరగదీస్తోంది. ఇప్పుడు ఈ సినిమా అక్కడి టీవీ చానెల్లో ప్లే అవుతుంది. రష్యన్ వాయిస్ ఓవర్‌తో డబ్బింగ్ చేసి విడుదల చేసిన బాహుబలి 2 సినిమా అక్కడి టీవీల్లో దుమ్ముదులుపుతుంది.
తాజాగా సినిమాలోని ఒకసన్నివేశాన్ని రష్యన్ వాయిస్ ఓవర్‌తో ఉన్న డైలాగ్‌తో రష్యన్ ఎంబసీ తమ ట్విటర్లో పెట్టింది. ఈ సందర్భంగా ' ఒక ఇండియన్ సినిమా రష్యాలో ఇంత పాపులార్ అవ్వడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. బాహుబలి 2 సినిమా రష్యన్ వాయిస్ ఓవర్లో టీవీల్లో ప్లే అవుతుంది' అంటూ క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయ నెటిజన్లు ఒక భారతీయ సినిమాను రష్యాలో విడుదల చేయడం సంతోషంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక బాహుబలి సిరీస్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాలం, కన్నడ, హిందీ, చైనీస్, జపనీస్ భాషల్లో రిలీజై దాదాపు రూ. 2600 కోట్లు కొల్లగొట్టింది. బాహుబలి 2 హిందీ వర్షన్ దాదాపు 250 కోట్ల రూపాయలతో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1800 కోట్ల రూపాయలను రాబట్టింది.
🎬 Indian cinema gains popularity in Russia. Look what Russian TV is broadcasting right now: the Baahubali with Russian voiceover! pic.twitter.com/VrIgwVIl3b
— Russia in India (@RusEmbIndia) May 28, 2020