Vyuham Movie: ఆర్జీవీకి ఎదురుదెబ్బ.. సెన్సార్‌ సర్టిఫికెట్‌ రద్దు

Vyuham Movie: సెన్సార్‌ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌ను క్వాష్‌ చేసిన హైకోర్టు

Update: 2024-01-23 04:43 GMT

Vyuham Movie: ఆర్జీవీకి ఎదురుదెబ్బ.. సెన్సార్‌ సర్టిఫికెట్‌ రద్దు

Vyuham Movie: వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌, దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు రివైజింగ్‌ కమిటీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను నిన్న హైకోర్టు క్వాష్‌ చేసింది. సినిమాలో కోర్టు ధిక్కరణకు పాల్పడేలా పలు అంశాలు ఉండటంతోపాటు వ్యక్తుల పరువుకు, హక్కులకు భంగం కలిగే అంశాలున్నాయని.. వాటిని పట్టించుకోకుండా రివైజింగ్‌ కమిటీ సర్టిఫికెట్‌ జారీచేసిందని హైకోర్టు తెలిపింది.

వ్యూహం సినిమా కోర్టు ధిక్కరణకు పాల్పడే విధంగా, పరువునష్టం కలిగించే విధంగా ఉందని, ఈ సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ రద్దు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ సూరేపల్లి నంద ధర్మాసనం సెన్సార్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేసింది. ఈ మేరకు విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది.

Tags:    

Similar News