Thaman Tweet On Sarkaru Vaari Paata : మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన తమన్!

Thaman Tweet On Sarkaru Vaari Paata : మరో రెండు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు రాబోతుంది. ఆగస్టు 9 న మహేష్ బాబు

Update: 2020-08-07 09:25 GMT
Thaman (File Photo)

Thaman Tweet On Sarkaru Vaari Paata : మరో రెండు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు రాబోతుంది. ఆగస్టు 9 న మహేష్ బాబు45 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాడు.. ఇది మహేష్ బాబుకి మాత్రమే కాదు.. అయన ఫ్యాన్స్ కూడా ఇది ఎంతో గొప్పదైన రోజు కూడా.. మహేష్ పుట్టినరోజుకి నెలరోజుల ముందునుంచే ట్విట్టర్ వేదికగా మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామా మొదలు పెట్టేశారు.

అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు మ్యూజిక్ సెన్సేషన్ తమన్.. మ‌హేశ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫ్యాన్స్ కు స‌ర్కారు వారి పాట మూవీ టీం నుంచి వాయిస్ మెసేజ్ విడుద‌ల చేయ‌నున్నట్టు వార్తలు వ‌చ్చిన సంగతి తెలిసిందే... అయితే మ‌హేశ్ బాబు ఓ మైక్ ముందున్న స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ.. మ‌రో 3 రోజుల్లో.. రెడీగా ఉన్నారా.. అంటూ నిన్న ట్వీట్ చేశాడు తమన్.. చూస్తుంటే మహేష్ ఫ్యాన్స్ కి చిత్ర యూనిట్ ఎదో పెద్ద గిఫ్ట్ ఇవ్వనుందని మాత్రం తెలుస్తోంది.

గీతా గోవిందం ఫేం పరుశురాంతో సర్కారు వారి పాట అనే సినిమాని చేస్తున్నాడు మహేష్ బాబు . ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక స్క్రిప్టు వర్క్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది.. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించనుంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంట‌ర్ టైన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇది మహేష్ కి 27 వ చిత్రం కావడం విశేషం!  


Tags:    

Similar News