Bheemla Nayak: భీమ్లా నాయక్ మూవీ పాటపై తెలంగాణ పోలీసుల అభ్యంతరం

Bheemla Nayak: పవన్‌ కల్యాణ్‌ నటించిన భీమ్లా నాయక్‌ మూవీలోని సాంగ్‌పై పోలీసులు అభ్యంతరం తెలిపారు.

Update: 2021-09-02 16:20 GMT

Bheemla Nayak: భీమ్లా నాయక్ మూవీ పాటపై తెలంగాణ పోలీసుల అభ్యంతరం

Bheemla Nayak: పవన్‌ కల్యాణ్‌ నటించిన భీమ్లా నాయక్‌ మూవీలోని సాంగ్‌పై పోలీసులు అభ్యంతరం తెలిపారు. పాటలోని కొన్ని పదాలు కించ పరిచే విధంగా ఉన్నాయంటూ ట్వీట్‌ చేశారు. భీమ్లా నాయక్‌ సినిమాలోని పాటలో కొన్ని పదాలు తమను భాదపెట్టే విధంగా ఉన్నాయంటూ డీసీపీ రమేష్‌ ట్వీట్‌ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని ఈస్ట్‌ జోన్‌ డీసీపీ రమేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు.

'తెలంగాణ పోలీసులు పీపుల్స్‌ ఫ్రెండ్లీ పోలీసులు, తమ రక్షణ కోసం మాకు జీతాలు ఇస్తున్న ప్రజల బొక్కలు మేం విరగొట్టం. పాట రచయితకు ఒక పోలీస్‌ గురించి వివరించేందుకు తెలుగులో ఇంతకంటే గొప్ప పదాలు దొరకనట్టున్నాయి' అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ పై ఫాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి చిత్రయూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.



Tags:    

Similar News