రెండు నెలలుగా జీతాలు లేవు.. ప్రభుత్వమే ఆదుకోవాలి సినిమా థియేటర్ కార్మికుల డిమాండ్
కరోనా వ్యాప్తి లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్స్ అన్ని మూతపడ్డాయి.
కరోనా వ్యాప్తి లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్స్ అన్ని మూతపడ్డాయి. ఈ లాక్ డౌన్ ప్రభుత్వం కార్మికులందరికీ పూర్తి జీతం ఇవ్వాలని జీవో నెంబర్ 45 తీసుకొచ్చిందని వారు సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. దీంతో థియేటర్లు పనిచేసే కార్మికులకు పూర్తి వేతనాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సినిమా థియేటర్స్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో నిరసన దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షను సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జి.వెంకటేష్, పాలడుగు భాస్కర్ ప్రారంభించారు.
థియేటర్స్‌లో లాక్ డౌన్ పేరుతో కార్మికులను పనిలో నుంచి తొలగిస్తున్నారని, వారికి ఇచ్చే వేతనంలో 40 నుంచి 50 శాతం కోతలు విధిస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను లెక్కచేయకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నా యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మార్చి, ఏప్రిల్ నెల జీతాలు ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. 20వేల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని, సినిమా థియేటర్లలో పనిచేసే కార్మికులకు నిత్యావసర సరుకులు, రూ.7,500 అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వారు కోరారు.