బిగ్ బాస్ హౌస్ లోకి తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

Update: 2019-07-28 08:46 GMT

బిగ్ బాస్ తొలి వారం పూర్తయింది. 15 మంది హౌస్ మేట్స్ లో ఆరుగురు ఎలిమినేషన్స్ కి నామినేట్ అయ్యారు. వారిలో ఇద్దరు సేఫ్ జోన్ లో ఉన్నట్టు శనివారం నాగార్జున ప్రకటించారు. కాగా, ఈరోజు ఒకర్ని ఎలిమినేట్ చేస్తారు. హేమ లేదా రాహుల్ లో ఒకరు కచ్చితంగా ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది. ఇద్దరిలో ఏ ఒక్కరు ఎలిమినేట్ అయినా.. 14 మంది సభ్యులు మిగులుతారు. అందుకోసం రెండో వారం ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.

ఇప్పటికే శ్రద్ధా దాస్ పేరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ, అనూహ్యంగా మరో కొత్త పేరు తెరమీదకు వచ్చింది. మిస్ ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవుతుందని బిగ్ బాస్ నుంచి లీకైన వార్త. తమన్నా సింహాద్రి టాలీవుడ్ లో మీటూ ఉద్యమం లో ప్రముఖంగా పాల్గొన్నారు. ఇప్పడు ఈమె బిగ్ బాస్ లోకి ఎంటర్ అవుతారని తెలుస్తోంది. ఈ వార్తలో నిజానిజాలు తేలాలంటే కొద్దిగా వేచి చూడక తప్పదు.  

Tags:    

Similar News