Harish Shankar: 'ఉస్తాద్' ప్లాప్‌.. ఎట్టకేలకు ఒప్పేసుకున్న 'కల్ట్' డైరెక్టర్..!

Harish Shankar: పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' పరాజయంపై దర్శకుడు హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు.

Update: 2026-04-12 04:17 GMT

 Harish Shankar: 'ఉస్తాద్' ప్లాప్‌.. ఎట్టకేలకు ఒప్పేసుకున్న 'కల్ట్' డైరెక్టర్..!

Ustaad Bhagat Singh: టాలీవుడ్‌లో 'గబ్బర్ సింగ్' వంటి సెన్సేషన్ క్రియేట్ చేసిన కాంబో పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్. వీరిద్దరి కలయికలో 14 ఏళ్ల తర్వాత వచ్చిన 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ, ఉగాది కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని పరాజయాన్ని చవిచూసింది. సినిమా రిజల్ట్ విషయంలో ఇన్నాళ్లూ తనదైన శైలిలో డిఫెండ్ చేసుకున్న హరీష్ శంకర్, తాజాగా తనే స్వయంగా ఈ ప్లాప్‌ను అంగీకరించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

'పాపం హరీష్'.. ఆ మాట వెనుక అంత అర్థం ఉందా?

రీసెంట్‌గా తిరువీర్ నటించిన ‘పాపం ప్రతాప్‌’ ట్రైలర్ లాంచ్‌కు హరీష్ శంకర్ హాజరయ్యారు. అక్కడ యాంకర్ స్రవంతి ఫన్నీగా పాపం హరీష్ అని పిలవడంతో ఆయన ఆసక్తికరంగా స్పందించారు. నేను రాగానే ఆమె పాపం అనగానే.. సర్లే మన సినిమా అనుకున్నంతగా ఆడలేదు కదా.. అందుకే అలా అన్నారేమో అని ఫీల్ అయ్యాను. ఆ విషయాన్ని నరేష్‌కి చెప్పి నవ్వుకున్నాం అంటూ హరీష్ సరదాగా వ్యాఖ్యానించారు.ఇన్నాళ్లూ సినిమా సక్సెస్ అయిందని కేక్ కట్ చేసి, అభిమానులు సన్మానాలు చేశారని చెప్పిన హరీష్.. ఇలా తనపై తాను జోక్ వేసుకుంటూ సినిమా ఆడలేదని చెప్పడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

అంచనాలు భారీ.. రిజల్ట్ దారుణం!

తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఉస్తాద్, రెండో రోజే కుప్పకూలిపోయింది. పవర్ స్టార్ క్రేజ్ కూడా ఈ సినిమాను డిజాస్టర్ నుంచి కాపాడలేకపోయింది.నార్త్ అమెరికాలో 1 మిలియన్ మార్క్ కూడా దాటలేకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది.దాదాపు రూ. 80 కోట్ల మేర ఈ చిత్రం నష్టాలను మిగిల్చినట్లు టాక్ నడుస్తోంది. 'ఓజీ' అప్‌డేట్స్‌తో ఖుషీగా ఉన్న ఫ్యాన్స్‌కు ఈ సినిమా రిజల్ట్ పెద్ద షాక్ ఇచ్చింది.

కెరీర్ అంటే సక్సెస్ మాత్రమే కాదు!

ఇదే వేదికపై తన కెరీర్ గురించి హరీష్ భావోద్వేగంగా మాట్లాడారు. నేను చేసింది 9 సినిమాలైతే, క్యాన్సిల్ అయినవి 19 సినిమాలు. హీరోలు ఓకే చేసి, ముహూర్తం షాట్ ఉందనగా ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇండస్ట్రీకి మనం వచ్చింది నచ్చిన పని చేయడానికే. మనం చేసిన పని ప్రేక్షకులకు నచ్చితే అది బోనస్ అని డైరెక్టర్ నరేష్‌ను ఉద్దేశించి హరీష్ స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పారు. మొత్తానికి 'ఉస్తాద్' ప్లాప్‌ను హరీష్ శంకర్ స్పోర్టివ్‌గా అంగీకరించడంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా పోయినా, హరీష్ మార్క్ కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గలేదని ఫ్యాన్స్ అంటున్నారు.



Tags:    

Similar News