Devara Part 2: ఎన్టీఆర్ ‘దేవర పార్ట్-2’లో తమిళ స్టార్ ఎంట్రీ!

Devara Part 2: మెగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర' బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అందరి కళ్లు 'దేవర పార్ట్-2' పైనే ఉన్నాయి.

Update: 2026-04-12 04:41 GMT

Devara Part 2: ఎన్టీఆర్ ‘దేవర పార్ట్-2’లో తమిళ స్టార్ ఎంట్రీ!

Devara Part 2: మెగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర' బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అందరి కళ్లు 'దేవర పార్ట్-2' పైనే ఉన్నాయి. ఈ సీక్వెల్‌లో కథను మలుపు తిప్పే ఒక కీలక పాత్ర కోసం కోలీవుడ్ విలక్షణ నటుడిని రంగంలోకి దించుతున్నట్లు వార్తలు వస్తుండటంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.

డిసెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభం

ఎన్టీఆర్ ఇప్పటికే 'దేవర' సీక్వెల్ గురించి స్పష్టతనిచ్చారు. తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాది డిసెంబర్ నెల నుండి రెండో భాగం చిత్రీకరణను ప్రారంభించాలని దర్శకుడు కొరటాల శివ భావిస్తున్నారు. మొదటి భాగం అందించిన విజయోత్సాహంతో, సీక్వెల్‌ను మరింత గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ పనులు , ముందస్తు నిర్మాణ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది.

ఆ ప్రత్యేక పాత్రలో విజయ్ సేతుపతి?

ఈ సినిమాలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ద్వితీయార్థంలో వచ్చే ఒక ప్రత్యేక ఎపిసోడ్. ఈ ఘట్టం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. ఈ కీలక పాత్ర కోసం తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఎంపిక చేసే ఆలోచనలో కొరటాల శివ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సేతుపతి నటనకు ఉన్న క్రేజ్ మరియు ఆయన పండించే గాంభీర్యం ఈ పాత్రకు పరిపూర్ణతను ఇస్తాయని మేకర్స్ నమ్ముతున్నారు. అదే గనుక నిజమైతే, ఎన్టీఆర్ మరియు విజయ్ సేతుపతిల మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయం.

ఉత్తరాది ప్రేక్షకులే లక్ష్యంగా కథలో మార్పులు

'దేవర' మొదటి భాగానికి ఉత్తరాదిలో విశేష స్పందన లభించింది. దీంతో పార్ట్-2 విషయంలో దర్శకుడు కొరటాల శివ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హిందీ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కథలో మరియు యాక్షన్ సన్నివేశాల్లో కొన్ని కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సినిమా స్థాయిని పెంచేలా అనిరుధ్ రవిచందర్ ఇప్పటికే సంగీత చర్చలను మొదలుపెట్టారు. నేపథ్య సంగీతం ఈ సీక్వెల్‌లో మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

భారీ తారాగణం, సాంకేతిక నిపుణులు

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా తన నటనతో ఆకట్టుకోగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో మెప్పించారు. వీరితో పాటు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్ మరియు మురళీ శర్మ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అత్యున్నత సాంకేతిక విలువల తో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News