అల్లు అర్జున్- రాజమౌళి కాంబో ఫిక్స్..?
SS Rajamouli and Allu Arjun Movie: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో 'వారణాసి' చిత్రం నిర్మిస్తున్నారు.
అల్లు అర్జున్- రాజమౌళి కాంబో ఫిక్స్..?
SS Rajamouli and Allu Arjun Movie: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో 'వారణాసి' చిత్రం నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి ఓ చిత్రం రూపొందించనున్నారనే టాక్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం ట్రైబల్ నేపథ్యంలో సాగనుందని ప్రచారం జరుగుతోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ చిత్రం 'వారణాసి'ని తెరకెక్కిస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి ఈ ప్రాజెక్టును విజువల్ వండర్‌గా మలచనున్నారు. గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి తదుపరి చిత్రం ఎవరితో ఉంటుందనే చర్చ సాగుతోంది. 'పుష్ప' సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నారు.
ఈ చిత్రం అనంతరం అల్లు అర్జున్ - రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారని తెలుస్తోంది. పూర్తిగా ట్రైబల్ నేపథ్యంలో ఈ కథ సాగనుందనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ కాంబినేషన్ నిజమైతే తెలుగు సినీ అభిమానులకు పండగే అని చెప్పవచ్చు.