ఎస్పీబీకి స్మారక మందిరం నిర్మిస్తాం -ఎస్పీ చరణ్

SP balasubrahmanyam Memorial : దివికేగిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మెమోరియల్ పై అయన తనయిడు ఎస్పీ చరణ్ స్పందించారు.. ఎస్పీబీ అభిమానుల కోసం స్మారక మందిరం నిర్మిస్తామని చరణ్ వెల్లడించారు.

Update: 2020-09-27 13:23 GMT

Sp charan, SP balasubrahmanyam

SP balasubrahmanyam Memorial : దివికేగిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మెమోరియల్ పై అయన తనయిడు ఎస్పీ చరణ్ స్పందించారు.. ఎస్పీబీ అభిమానుల కోసం స్మారక మందిరం నిర్మిస్తామని చరణ్ వెల్లడించారు. ఆ విగ్రహాన్ని అయన ఎంతో ఇష్టపడే తామరైపాక్కంలోని ఫార్మ్ హౌస్లోనే మా సొంత ఖర్చులతో నిర్మిస్తామని చరణ్ తెలిపారు.. తెలుగు, తమిళ భాషలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న నాన్న గారి అభిమానులు ఆయన్ని స్మరించుకునేలా , ప్రజలు అందరూ వచ్చి సందర్శించేలా ఏర్పాటు చేస్తామని, దానిని ప్రజలకి అంకితం చేస్తాం చరణ్ వెల్లడించారు. అటు బాలు తన సొంత ఊరు నెల్లూరు లో ఉన్న తన ఇంటిని వేద పాఠశాలకు ఇస్తున్నానని, అక్కడ తన తల్లిదండ్రుల విగ్రహాలు పెట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఆయన తల్లిదండ్రులు విగ్రహాలతో పాటుగా అయన విగ్రహాన్ని కూడా చేయించుకున్నారు బాలు.. కానీ ఆయనకి కరోనా సోకడం వలన అయన ఆ విగ్రహాలను ఆవిష్కరించ లేకపోయారు. ఇప్పుడు ఆ విగ్రహల దగ్గరే బాలు విగ్రహం కూడా అక్కడే ఆవిష్కరిస్తారని తెలుస్తోంది.

ఇక బాలు దాదాపుగా అయిదు దశాబ్దాల పాటు సంగీత ప్రపంచాన్ని తన అద్భుతమైన గొంతుతో అలరించారు.. జనరేషన్ మారిన కొద్ది అయన కూడా మారుతూ కథానాయకుల గొంతుకు తగట్టుగా పాటలు పాడుతుండేవారు. అందుకే బాలు పాట ఎప్పటికి ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది.. ఏడుపదుల వయసులో కూడా ఎంతో యాక్టివ్ అయన తన గాత్రంతో ఆకట్టుకున్నారు. ఆ పాట అంటే ఆయనే పాడాలి.. అయన పాడితేనే ఆ పాటకి ఓ అందం వస్తుంది.. అసలు ఆ పాట ఆయన కోసమే పుట్టిందా అన్నట్టుగా అనిపించేది.. . అలా ఒక భాష నుంచి ఒక పాట నుంచి దాదాపుగా 16 భాషల్లో 40వేలకి పైగా పాటలు పాడి చాలా మంది అభిమానులని సొంతం చేసుకున్నారు.అయితే గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అయన శుక్రవారం మధ్యాహ్నం MGM ఆసుపత్రిలో మరణించారు.

Tags:    

Similar News