మరింత మెరుగ్గా ఎస్పీబీ ఆరోగ్యం!

SP Balasubrahmanyam : ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం ..

Update: 2020-09-20 08:54 GMT

SP Balasubrahmanyam

SP Balasubrahmanyam : ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గత నెల 05 ఆసుపత్రిలో చేరిన ఆయన, ఆరోగ్య పరిస్థితి మెల్లిమెల్లిగా కుదురుకుంటుంది.. అయితే తాజాగా అయన ఆరోగ్య పరిస్థితి పైన అయన తనయుడు ఎస్పీ చరణ్ శనివారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ వీడియోను పోస్ట్‌ చేశారు.

ఈ వీడియోలో చరణ్ మాట్లాడుతూ.. తన తండ్రి ఆరోగ్యం మరింతగా మెరుగుపడుతుందని అన్నారు. అయితే ఇంకా ఎస్పీబీ వెంటిలేటర్‌ మీదే ఉన్నారని, ఊపిరితిత్తులు, శ్వాస వ్యవస్థ, శక్తి మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.. రోజూ 10 నుంచి 15 నిమిషాలు ఫిజియోథెరపీ చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఇక శుక్రవారం నుంచి ఆహారం తీసుకుంటున్నట్టుగా చెప్పారు.. త్వరలో అయన మరింతగా కోలుకోనున్నారని వెల్లడించారు.. ఈ సందర్భంగా తన తండ్రి ఆరోగ్యం పట్ల సహకరించిన ప్రతి ఒక్కరిని ధన్యవాదాలు అని తెలిపారు ఎస్పీ చరణ్..

కరోనా పాజిటివ్ అని తెలియగానే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను ఆగస్టు 5 న చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో చేర్చారు.ఆసుపత్రికి తీసుకువెళ్ళినప్పుడు బాలసుబ్రహ్మణ్యంకు తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపించాయి. కానీ ఆ తర్వాత పరిస్థితి విషమిచడంతో ఐసియుకు తరలించి చికిత్సను అందించారు వైద్యులు.. ఈ క్రమంలో అయన కోలుకోవాలని అభిమానులతో పాటుగా సినీ సెలబ్రిటీలు కోరుకున్నారు.



Tags:    

Similar News