SP Balasubrahmanyam health: విషమంగానే గానగంధర్వుడు బాలూ ఆరోగ్య పరిస్థితి.. ఆసుపత్రి వర్గాలు!

SP Balasubrahmanyam health: కరోనా బారిన పడ్డ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విష్మంగానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

Update: 2020-08-19 14:26 GMT

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్ తో పోరాటం చేస్తున్నారు. కొన్నిరోజులుగా వెంటిలేటర్ మీద ఉన్న బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెన్నై లోని ఎంజీఎం ఆస్పత్రి వెల్లడించింది. తాజాగా ఆసువాత్రి విడుదల చేసిన బులిటిన్ లో బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిని వివరించింది. బాలు ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని వెల్లడి... ఐసీయూలో ఎక్మో సపోర్ట్ తో పోరాడుతున్నట్లు ఆ బులిటిన్ లో వైద్యులు పేర్కొన్నారు.

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన విషయం తెలిసిందే. . ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వీడియో ద్వారా వెల్లడించారు. గత మూడు రోజులుగా కాస్త అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించామని, అయితే టెస్టుల్లో కోవిడ్19 పాజిటివ్‌గా తేలిందన్నారు. మెడిసిన్ ఇచ్చి హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారని చెప్పారు. కుటుంబసభ్యలుకు ఇబ్బంది కలగకూడదని భావించి ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని ఏ ఆందోళన అక్కర్లేదని వీడియో ద్వారా ఎస్పీబీ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి జ్వరం తగ్గిందని, త్వరలోనే కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి వెళ్తానని ఎస్పీ బాలు ధీమా వ్యక్తం చేశారు.

కాగా, బాలూ ఆరోగ్య పరిస్థితి పై సినీ రంగానికి చెందిన అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారంతా అయన ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్తిస్తున్నారు. ఇక బాలూ తనయుడు ఎస్పీ చరణ్ కూడా తన తండ్రి వెంటిలేటర్ పై చికిత్స పొండుతున్నారంటూ ఈరోజు ఉదయం ప్రకటించారు. బాలూ అభిమానులంతా ఆయన క్షేమంగా ఈ ఉపద్రవం నుంచి బయటపడాలని కోలుకుంటున్నారు.

Tags:    

Similar News