SP Balasubrahmanyam Tests Positive: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్‌

SP Balasubrahmanyam Tests Positive: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్‌
x
Highlights

SP Balasubrahmanyam Tests Positive: కరోనా వైరస్ ఎవ్వరినీ వదలట్లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే...

SP Balasubrahmanyam Tests Positive: కరోనా వైరస్ ఎవ్వరినీ వదలట్లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు కరోనా సోకగా.. తాజాగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వీడియో ద్వారా వెల్లడించారు.

గత మూడు రోజులుగా కాస్త అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించామని, అయితే టెస్టుల్లో కోవిడ్19 పాజిటివ్‌గా తేలిందన్నారు. మెడిసిన్ ఇచ్చి హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారని చెప్పారు. కుటుంబసభ్యలుకు ఇబ్బంది కలగకూడదని భావించి ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని ఏ ఆందోళన అక్కర్లేదని వీడియో ద్వారా ఎస్పీబీ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి జ్వరం తగ్గిందని, త్వరలోనే కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి వెళ్తానని ఎస్పీ బాలు ధీమా వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories