'I'm Not National Hero : నేను హీరోను కాదు.. కేవలం మానవత్వం ఉన్న మనిషిని మాత్రమే : సోనూసూద్‌

‘I’m Not National Hero : లాక్ డౌన్ సమయంలో వలసకూలీల కష్టాలు అంతా ఇంతా కాదు... వారిని ఆదుకోవడానికి ఎంతోమంది ముందుకు వచ్చారు

Update: 2020-08-15 07:00 GMT
Sonu Sood (File Photo)

'I'm Not National Hero : లాక్ డౌన్ సమయంలో వలసకూలీల కష్టాలు అంతా ఇంతా కాదు... వారిని ఆదుకోవడానికి ఎంతోమంది ముందుకు వచ్చారు అందులో బాలీవుడ్ నటుడు సోనుసూద్ ఒకరు.. వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్‌ దేవుడుగా నిలిచాడు. ఇప్పుడు కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు సోనూసూద్‌.. లాక్ డౌన్ సమయంలోనే కాదు.. ఇప్పటికీ ఎవరికీ ఏ సమస్య వచ్చిన ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాడు.. నిజానికి సోనుసూద్ సినిమాల్లో విలన్ అయినప్పటికీ అంద‌రి దృష్టిలో ఇప్పుడు రియల్ హీరో... దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన, విన్నాగాని సోనూసూద్‌ పేరే వినిపిస్తుంది.

అయితే తాజాగా శనివారం 74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ వీడియోని రిలీజ్ చేశారు సోనూ సూద్‌.. ఈ వీడియోలో సోనుసూద్ మాట్లాడుతూ.. దేశమంతా తనను హీరోగా పిలుస్తున్నారని అయితే తను కేవలం మానవత్వం ఉన్న మనిషిని మాత్రమేనని ఒక మనిషిగా సాటి మనిషికి సేవలు అందిస్తున్నాన్ని అన్నారు సోనుసూద్.. . ప్రతి ఒక్కరి ప్రేమ, ఆశీర్వాదాలతోనే తానూ ఈ పనులు చేయగలుగుతన్నానని వెల్లడించాడు సోనుసూద్.. అయితే ఈ పనులకి తనని అభినందించడం కాకుండా ఎదుటివారికి సహాయం చేయాలనీ అభిమానులను కోరాడు సోనుసూద్..

ఇక తనకి ప్రతిరోజు చాలా మంది ట్వీట్స్ ,మెయిల్స్ చేస్తున్నారు... కానీ వాళ్లందరికీ నేను సాయం చేయలేను.. రోజుకు కనీసం 30 నుంచి 40 సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాను.. ఇంకా ఎక్కువ చేసేందుకు ప్రయత్నిస్తున్నాను.. అయితే నాకన్నా ఎక్కువ సహాయం చేయగలిగే సామర్థ్యం, శక్తి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు.. వారు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరుకుంటున్నాను.. ఆపదలో ఉన్నవారికీ సహాయం చేయడమే దేశభక్తికి నిజమైన అర్ధం అని సోనుసూద్ వెల్లడించారు.


  

Tags:    

Similar News