Sonu Sood: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్
Sonu Sood: బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన 52వ పుట్టినరోజును సాధారణంగా కాదు, సామాజిక సేవతో మరింత అర్థవంతంగా మార్చుకున్నారు.
Sonu Sood: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్
Sonu Sood: బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన 52వ పుట్టినరోజును సాధారణంగా కాదు, సామాజిక సేవతో మరింత అర్థవంతంగా మార్చుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన 500 మంది వృద్ధుల కోసం వృద్ధాశ్రమం నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. కుటుంబం లేని వృద్ధులకు సురక్షితమైన, ఆదరణ కలిగిన వాతావరణం అందించేందుకు ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఈ వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించడమే కాదు, వారికి వైద్య సదుపాయాలు, పోషకాహార భోజనం వంటి అవసరాలన్నీ అందుబాటులో ఉంచనున్నారు. సోనూ ఈ ప్రకటనతో మళ్లీ ఒకసారి “రియల్ హీరో”గా ప్రశంసలు అందుకుంటున్నారు.
కరోనా మహమ్మారి సమయంలో వందలాది మంది వలస కార్మికులకు సహాయం చేసి, ప్రయాణ సదుపాయాలు కల్పించి, దేశవ్యాప్తంగా అనేకమందికి ఆదర్శంగా నిలిచిన సోనూసూద్, ఇప్పుడు వృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరోసారి తన సేవాభావాన్ని నిరూపించుకున్నారు.
పుట్టినరోజును సందడి కాకుండా, సేవతో జ్ఞాపకాలుగా మలచుకునే సోనూ సూడ్ చర్య నిజంగా ప్రేరణాత్మకంగా ఉంది.