Singer Mangli: సింగర్ మంగ్లీకి తృటిలో తప్పిన ప్రమాదం..

Singer Mangli: ప్రముఖ సింగర్ మంగ్లీకి ప్రమాదం తృటిలో తప్పింది. కారులో ప్రయాణిస్తున్న మంగ్లీ కారును డీసీఎం వాహనం ఢీ కొట్టింది.

Update: 2024-03-18 05:29 GMT

Singer Mangli: సింగర్ మంగ్లీకి తృటిలో తప్పిన ప్రమాదం..

Singer Mangli: ప్రముఖ సింగర్ మంగ్లీకి ప్రమాదం తృటిలో తప్పింది. కారులో ప్రయాణిస్తున్న మంగ్లీ కారును డీసీఎం వాహనం ఢీ కొట్టింది. శంషాబాద్ తొండుపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరై అర్ధరాత్రి తర్వాత మేఘ్‌రాజ్‌, మనోహర్‌తో కలిసి ఆమె కారులో హైదరాబాద్‌-బెంగళూర్‌ జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయల్దేరారు. తొండుపల్లి వంతెన వద్దకు రాగానే కర్ణాటకకు చెందిన ఓ డీసీఎం వ్యాన్‌ వెనక నుంచి వేగంగా వచ్చి వీరి కారును ఢీకొట్టడంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు వెనక భాగం దెబ్బతింది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

Tags:    

Similar News