Singer Mangli: షూటింగ్‌లో సింగర్ మంగ్లీకి గాయాలు..ఏమి జరిగిందంటే?
Singer Mangli: సింగర్ మంగ్లీకి గాయాలు అయినట్లు తెలుస్తోంది.
Singer Mangli: షూటింగ్‌లో సింగర్ మంగ్లీకి గాయాలు..ఏమి జరిగిందంటే?
Singer Mangli: సింగర్ మంగ్లీకి గాయాలు అయినట్లు తెలుస్తోంది. తెలంగాణలో బోనాలు జరుగుతున్న సందర్భంగా ఓ ప్రైవేట్ సాంగ్ చిత్రీకరణలో ఆమె పాల్గొన్నారు. అయితే షూటింగ్ సమయంలో మంగ్లీ కాలు జారి కింద పడ్డారు. దీంతో ఆమె కాలికి గాయమైంది. వెంటనే యూనిట్ సభ్యులు మంగ్లీని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు సింగర్‌కు చికిత్స చేసి డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. స్వల్పగాయాలు కావడంతో మంగ్లీ త్వరగానే కోలుకుంటారని వైద్యులు తెలుపుతున్నారు. అయితే ప్రమాదమేమీ లేదని.. కాకపోతే ఖచ్చితంగా కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.